Womens World Cup 2022: చ‌రిత్ర సృష్టించిన భారత ఫాస్ట్ బౌలర్.. ఆ లిస్టులో ఏకైక మహిళా ప్లేయర్‌గా రికార్డు..

|

Mar 16, 2022 | 4:44 PM

మహిళల ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌(INDW vs ENGW)పై భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ భారతదేశానికి ప్రత్యేకమైనది కాకపోవచ్చు, కానీ.. ఝులన్ గోస్వామికి మాత్రం తన కెరీర్‌లో గుర్తుండిపోయేలా నిలిచింది.

Womens World Cup 2022: చ‌రిత్ర సృష్టించిన భారత ఫాస్ట్ బౌలర్.. ఆ లిస్టులో ఏకైక మహిళా ప్లేయర్‌గా రికార్డు..
Womens World Cup 2022 Jhulan Goswami
Follow us on

భారత ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి(Jhulan Goswami) వన్డే క్రికెట్‌లో 250 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్‌గా రికార్డు సృష్టించింది. ప్రపంచకప్‌(Women’s World Cup 2022)లో ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించింది. అయితే మహిళల ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌(INDW vs ENGW)పై భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ భారతదేశానికి ప్రత్యేకమైనది కాకపోవచ్చు, కానీ.. ఝులన్ గోస్వామికి మాత్రం తన కెరీర్‌లో గుర్తుండిపోయేలా నిలిచింది. 250 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్‌గా ఝులన్‌ రికార్డు సృష్టించడంతో ఐసీసీ ప్రత్యేకంగా అభినందిస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేసింది. వన్డేల్లో 200కి పైగా వికెట్లు తీసిన ఏకైక మహిళా క్రీడాకారిణి ఆమె నిలిచింది. ప్రస్తుతం 250 వికెట్లు తీసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ టామీ బ్యూమాంట్‌పై ఎల్‌బీడబ్ల్యూ చేయడం ద్వారా ఝులన్‌ ఈ రికార్డు సృష్టించింది.

టెస్ట్ క్రికెట్‌లో కూడా అద్భుతమైన ప్రదర్శన..

జులన్ గోస్వామి వన్డేలతో పాటు టెస్ట్ క్రికెట్‌లో కూడా అద్భుతంగా బౌలింగ్ చేసింది. ఝులన్ టెస్టు క్రికెట్‌లో మూడుసార్లు ఐదు వికెట్లు, ఒకసారి పది వికెట్లు పడగొట్టింది. ఒక ఇన్నింగ్స్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన 25 పరుగులకు 5 వికెట్లుగా నిలిచింది. ఒక టెస్ట్ మ్యాచ్‌లో గోస్వామి అత్యుత్తమ ప్రదర్శన 78 పరుగులకు 10వికెట్లుగా నెలకొంది. ఇది కాకుండా, ఝులన్ టీ20 క్రికెట్‌లో 68 మ్యాచ్‌లలో 56 వికెట్లు తీసి 5.45 ఎకానమీ వద్ద పరుగులు చేసింది. టీ20లో ఝులన్‌ బ్యాట్‌ నుంచి 405 పరుగులు వచ్చాయి.

మహిళల ప్రపంచకప్‌లో..

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్.. రెండోసారి ఓటమి పాలైంది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ తదుపరి 3 మ్యాచ్‌లలో 2 గెలవాల్సి ఉంటుంది. ఇకపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో భారత్‌ బాగా ఆడాల్సి ఉంది. ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది రెండో ఓటమి. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించింది. అదే సమయంలో పాకిస్థాన్, వెస్టిండీస్‌పై టీమిండియా విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు విజయం సాధించింది. అంతకుముందు, ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూడాల్సి ఉండగా, నాలుగో మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఇంగ్లండ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవాలనే ఆశలను సజీవంగా ఉంచుకుంది.

Also Read: Womens World Cup 2022: ఓటమితో మారిన టీమిండియా లెక్కలు.. సెమీఫైనల్ చేరేందుకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే?

ICC Women’s ODI Team Rankings: సెంచరీతో ఆకట్టుకున్నా.. భారత బ్యాటర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టాప్ 10లో ఎవరున్నారంటే?