IND vs IRE, WT20: సెమీస్ చేరిన భారత్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం.. హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన మంధాన..

ICC Women's T20 World Cup IND-W Vs IRE-W Match Report: మ్యాచ్‌లో టీమిండియా 5 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. భారత్ నుంచి జరిగిన ఈ మ్యాచ్‌లో స్మృతి 87 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది.

IND vs IRE, WT20: సెమీస్ చేరిన భారత్.. కీలక మ్యాచ్‌లో ఘన విజయం.. హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన మంధాన..
Team India Womens

Updated on: Feb 20, 2023 | 10:20 PM

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ 5 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 156 పరుగులు చేసింది. టీమ్ ఇండియా తరుపున స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన 56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 87 పరుగులతో అర్ధ సెంచరీ చేసింది. స్మృతి అద్భుత బ్యాటింగ్‌తో భారీ స్కోర్ చేసింది. ఈ విజయం తర్వాత, టీమ్ ఇండియా ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది.

టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌పై విజయం సాధించిన భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. టీ20 మహిళల ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా టీమిండియా నిలిచింది. అదే సమయంలో, ఇంగ్లండ్ తర్వాత గ్రూప్ 2లో భారత జట్టు ఫైనల్ 4లోకి చేరింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కచ్చితంగా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.

మంధాన తుఫాన్ ఇన్నింగ్స్..

భారత జట్టు తరపున, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఐర్లాండ్‌పై బ్యాట్‌తో విరుచుకుపడింది. ఈ కీలక మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొని 87 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో స్మృతి 9 ఫోర్లు, 3 అద్భుతమైన సిక్సర్లు కొట్టింది. మంధాన తొలి వికెట్‌కు షెఫాలీ వర్మతో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అదే సమయంలో, చివరి ఓవర్లలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించింది. స్మృతి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఐర్లాండ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా, ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఫలితం రావడం అభిమానులకు నిరాశ కలిగించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us