T20 World Cup 2026 Final: ఓటమే ఎరుగని రెండు జట్లు ఢీ కొడితే ఎలా ఉంటదో తెలుసా.. తొలిసారి ఇలాంటి మ్యాచ్..!

AUS W vs ENG W Head to Head: క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో ఈ ఇరు జట్ల మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయం. ఆస్ట్రేలియాకు మెగా టోర్నీల ఫైనల్స్ ఆడిన అనుభవం అండగా ఉంటే, ఇంగ్లాండ్ జట్టుకు సొంత ప్రేక్షకుల మద్దతు కొండంత బలాన్ని ఇస్తోంది. ప్రపంచకప్ ట్రోఫీ ఏ జట్టును వరిస్తుందో చూడాలి.

T20 World Cup 2026 Final: ఓటమే ఎరుగని రెండు జట్లు ఢీ కొడితే ఎలా ఉంటదో తెలుసా.. తొలిసారి ఇలాంటి మ్యాచ్..!
England Women Vs Australia Women, Final

Updated on: Jul 05, 2026 | 9:55 AM

AUS W vs ENG W Head to Head: మహిళల క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద సమరానికి సమయం ఆసన్నమైంది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో టీ20 ప్రపంచకప్-2026 ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళల జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఓటమనేదే తెలియకుండా దూసుకుపోతున్న ఈ ఇరు జట్ల మధ్య జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన విందును పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫైనల్ చేరిన అజేయ శక్తులు..

ఈ మెగా టోర్నీలో ఇరు జట్ల ప్రయాణం అద్భుతంగా సాగింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. స్టార్ ప్లేయర్ నాట్ సివర్ బ్రంట్ గాయంతో దూరం కావడంతో చార్లీ డీన్ సారథ్యంలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను 40 పరుగుల తేడాతో చిత్తు చేసింది. డానియెల్ వ్యాట్ హాడ్జ్ మెరుపు ఆరంభాలు ఇస్తుండగా, డానియెల్ గిబ్సన్, సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ప్రత్యర్థులను వణికిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వాడిని క్షమించను.. నమ్మి 7 నెలల తర్వాత ఛాన్స్ ఇస్తే నట్టేట ముంచాడు..

ఇవి కూడా చదవండి

మరోవైపు, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. గ్రూప్ దశ నుంచి సెమీస్ వరకు దక్షిణాఫ్రికా, భారత్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లను ఓడిస్తూ అజేయంగా లార్డ్స్ మైదానంలో అడుగుపెట్టింది. బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ బ్యాటింగ్‌లో రాణిస్తుండగా, కెప్టెన్ సోఫీ మోలినీక్స్, మేగాన్ షుట్, జార్జియా వేర్హామ్ ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు తీస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు.

హెడ్-టు-హెడ్ రికార్డులు: పైచేయి ఎవరిది?

మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య గట్టి పోటీ ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు 45 మ్యాచ్‌ల్లో తలపడగా, ఆస్ట్రేలియా 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లాండ్ 20 మ్యాచ్‌ల్లో గెలిచి గట్టి పోటీని ఇచ్చింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రికార్డుల పరంగా ఆస్ట్రేలియా స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, సొంత గడ్డపై ఆడుతుండటం ఇంగ్లాండ్‌కు కలిసివచ్చే అంశం.

Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..!

గణాంకాల్లో కొన్ని ఆసక్తికర విషయాలు..

అత్యధిక స్కోరు: ఈ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా నమోదు చేసిన 226/3 పరుగులే అత్యధిక జట్టు స్కోరు. 2019లో చెల్మ్స్‌ఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఈ భారీ స్కోరు సాధించింది.

అల్ప స్కోరు: ఇంగ్లాండ్ జట్టు 2015లో హోవ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై కేవలం 87 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది ఇరు జట్ల మధ్య నమోదైన అత్యల్ప స్కోరు.

వ్యక్తిగత అత్యధిక స్కోరు: ఆస్ట్రేలియా దిగ్గజం మెగ్ లాన్నింగ్ 2019లో ఇంగ్లాండ్‌పై కేవలం 63 బంతుల్లో 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన: ఇంగ్లాండ్ మాజీ పేసర్ అన్యా శ్రుబ్‌సోల్ 2015లో కార్డిఫ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ బౌలింగ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది.

ఇది కూడా చదవండి: వైభవ్ కాదు.. టీమిండియాలో ఆ మెంటలోడ్ని ఆపకుంటే మేమంతా అస్సాంకే..

పరుగుల రాణులు, వికెట్ల విజేతలు..

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ ఇరు జట్ల మధ్య జరిగిన టీ20ల్లో 29 ఇన్నింగ్స్‌లలో 987 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే, బౌలింగ్ విభాగంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మేగాన్ షుట్ 25 మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది. గత యాషెస్ సిరీస్ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ బెత్ మూనీ 94 పరుగులతో రాణించగా, జార్జియా వేర్హామ్ 11 పరుగులకే 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us