ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్ గురువారం (అక్టోబర్ 3) నుంచి ప్రారంభం కానుంది. యూఏఈ వేదికగా జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. తొలి రౌండ్‌లో గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్-ఎలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు, గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు తలపడనున్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ ధనాధన్ టోర్నమెంట్ అక్టోబర్ 20 వరకు జరుగుతుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల అనంతరం రెండు గ్రూప్‌ల్లో టాప్-2లో ఉన్న జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి.
కాగా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో టీమ్ఇండియా మరోసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. 2020లో ఫైనల్ దాకా వెళ్లిన టీమ్ఇండియా ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది. ఇక గతేడాది జరిగిన టోర్నీలో సెమీస్ లోనే నిష్ర్కమించింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూపులో ఉన్నాయి. కాబట్టి గ్రూప్ దశలో రెండు జట్ల మధ్య పోటీ ఉంటుంది. ఈ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 6న మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. దుబాయ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇటీవల ఆసియా కప్‌లో ఇరు జట్లు తలపడగా, అక్కడ టీమ్‌ఇండియా సులువుగా గెలిచింది.
𝗠𝗮𝗿𝗸 𝗬𝗼𝘂𝗿 𝗖𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿 🗓️#TeamIndia‘s schedule for the ICC Women’s #T20WorldCup 2024 is 𝙃𝙀𝙍𝙀 🔽 pic.twitter.com/jbjG5dqmZk
— BCCI Women (@BCCIWomen) August 26, 2024
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్) , పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ , సంజన సజీవన్
ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా ఛెత్రీ (వికెట్‌కీపర్), తనూజా కన్వర్, సైమా ఠాకూర్
నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రాఘవి బిస్త్, ప్రియా మిశ్రా
#TeamIndia register a 28-run win in their second warmup fixture! 🙌
A solid bowling display as they successfully defend 144 against South Africa 👏👏
📸: ICC
Scorcard – https://t.co/2bxYYzLGH1#T20WorldCup | #WomenInBlue pic.twitter.com/Bq9R2kCDeI
— BCCI Women (@BCCIWomen) October 1, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..