Asia Cup 2022: ఇక మహిళల వంతు.. టీ20 ఆసియా కప్ షెడ్యూల్ ఇదే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

Women’s T20 Asia Cup: ఆసియా క్రికెట్ కౌన్సిల్ 2022 మహిళల టీ20 ఆసియా కప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ టోర్నీ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది.

Asia Cup 2022: ఇక మహిళల వంతు.. టీ20 ఆసియా కప్ షెడ్యూల్ ఇదే.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Women's Asia Cup 2022

Updated on: Sep 21, 2022 | 6:46 AM

Women’s T20 Asia Cup Schedule: పురుషుల T20 ఆసియా కప్ ముగిసిన తర్వాత, ఆసియా క్రికెట్ కౌన్సిల్ మహిళల T20 ఆసియా కప్ నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. మహిళల టీ20 ఆసియా కప్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కాగా అక్టోబర్ 15న ముగుస్తుంది. మహిళల టీ20 ఆసియా కప్ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జైషా మంగళవారం విడుదల చేశారు. పురుషుల తర్వాత ఈసారి, మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో భారత్ కీలక మ్యాచ్ అక్టోబర్ 7న జరగనుంది.

ఆసియా కప్ మహిళల T20 ఆసియా కప్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. వచ్చే నెల నుంచి బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌లో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఆసియా కప్‌లో అక్టోబర్ 7న పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఈ టోర్నీని రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. దీని కింద మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అదే సమయంలో ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్, ఆతిథ్య బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, థాయ్‌లాండ్, మలేషియా జట్లు పాల్గొంటాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పాలన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల జట్టు లేదని తెలిసిందే. ఆసియా కప్‌లో భాగంగా అక్టోబర్ 1న భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

పురుషుల ఆసియా కప్ 2022ను గెలిచిన శ్రీలంక..

ఇవి కూడా చదవండి

దుబాయ్‌లో జరిగిన 2022 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. చివరి మ్యాచ్‌లో తొలుత ఆడిన శ్రీలంక 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. జవాబుగా పాకిస్థాన్ జట్టు 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎనిమిదేళ్ల తర్వాత శ్రీలంక ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శ్రీలంక ఆరోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. పురుషుల ఆసియా కప్ ఆరంభంలో శ్రీలంక గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ శ్రీలంక ఈ టోర్నీలో అద్భుతమైన ఆటను కనబరిచింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆసియా కప్ 2022 పురుషుల టైటిల్‌ను గెలుచుకుంది.