Women’s cricket: సౌతాఫ్రికా సిరీస్‌కు వన్డే, టీ 20లకు టీమిండియా మహిళా జట్లు ఇవే..

|

Feb 27, 2021 | 7:43 PM

సౌతాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్​లకు టీమిండియా ఉమెన్స్‌ జట్టును ఆల్​ ఇండియా ఉమెన్స్​ సెలెక్షన్​ కమిటీ ప్రకటించింది. లఖ్​​నవూ వేదికగా మార్చి 7 నుంచి 5 మ్యాచ్​ల..

Women’s cricket: సౌతాఫ్రికా సిరీస్‌కు వన్డే, టీ 20లకు టీమిండియా మహిళా జట్లు ఇవే..
womens cricket
Follow us on

BCCI Announces: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్​లకు టీమిండియా ఉమెన్స్‌ జట్టును ఆల్​ ఇండియా ఉమెన్స్​ సెలెక్షన్​ కమిటీ ప్రకటించింది. లఖ్​​నవూ వేదికగా మార్చి 7 నుంచి 5 మ్యాచ్​ల వన్డే సిరీస్ మొదుల కానుండగా.. మార్చి 20 నుంచి 3 మ్యాచ్​ల టీ20 సిరీస్​ ఆరంభం కానుంది.

అయితే ఇందులో ఏక్తా బిష్ఠ్​​, అనుజా పాటిల్, వేద క్రిష్ణమూర్తి, తానియా భాటియా, శిఖా పాండేలకు చోటు దక్కలేదు. ప్రత్యూష, యాస్తిక భాటియా, ఆయూషి సోని, శ్వేత వర్మ, మోనికా పటేల్​, సిమ్రాన్​ దిల్ బహదూర్​లకు తొలిసారి జాతీయ మహిళ జట్టులో స్థానం కల్పించింది సెలెక్షన్ కమిటీ.

వెటరన్ క్రికెటర్​ మిథాలీ రాజ్​ వన్డే జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. హర్మన్​ప్రీత్​ కౌర్​ టీ-20 టీంకు కెప్టెన్​గా ఉండనుంది. రెండు ఫార్మాట్లలోనూ వికెట్​ కీపర్​గా సుష్మా వర్మకు అవకాశం కల్పించారు.

టీమిండియా ఉమెన్స్ వన్డే జట్టు సభ్యులు:

మిథాలీ రాజ్​(కెప్టెన్), స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, పూనమ్​ రౌత్, ప్రియా పూనియా, యాస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్), హేమలత, దీప్తి శర్మ, సుష్మా వర్మ (వికెట్ కీపర్), శ్వేతా వర్మ (వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్​, జులన్ గోస్వామి, మాన్సీ జోషి, పూనం యాదవ్, ప్రత్యూష, మోనికా పటేల్.

టీమిండియా ఉమెన్స్ టీ20 జట్టు సభ్యులు:

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలి వర్మ, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్ డియోల్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), నుజాత్ పర్వీన్ (వికెట్ కీపర్), అయుషి సోనీ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, మాన్సీ జోషి, మోనికా పటేల్, ప్రత్యుషా, సిమ్రాన్ దిల్ బహదూర్.

ఇది కూడా చదవండి :

SBI Alert: కస్టమర్లకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఇలాంటి ఎస్ఎంఎస్ మీ ఫోన్‌కు వస్తే జాగ్రత్త.. వెంటనే బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేయండి..

ఉద్యోగం మారిన ప్రతిసారి కొత్త అకౌంట్ తీసుకుంటున్నారా.. అయితే మీరు ఇవి తప్పకుండా పాటించాలి…