IND vs Srilanka: శ్రీలంక ను చిత్తు చేసిన భారత్.. 82 పరుగుల భారీ తేడాతో విజయం

|

Oct 09, 2024 | 11:40 PM

టీమిండియా దుమ్మురేపింది. మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, టీమిండియా రన్‌రేట్‌...

IND vs Srilanka: శ్రీలంక ను చిత్తు చేసిన భారత్.. 82 పరుగుల భారీ తేడాతో విజయం
Ind Vs Srilanka
Follow us on

టీమిండియా దుమ్మురేపింది. మహిళల టీ20 ప్రపంచకప్‌ 2024లో తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. డూ ఆర్‌ డై మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో పాటు, టీమిండియా రన్‌రేట్‌ (0.560) కూడా పెరిగింది. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే గ్రూప్-ఏ నుంచి సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

ఇక బుధవారం జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్), షెఫాలి వర్మ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఇక చివర్లో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (27 బంతుల్లో 52*; 8 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీ చేసింది. జెమీమా రోడ్రిగ్స్‌ (16), రిచా ఘోష్ (6*) పరుగులు చేశారు.

అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగన శ్రీలంక ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 82 పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. శ్రీలంక బ్యాటర్ల విషయానికొస్తే.. కవషా దిల్హరి(21; 22 బంతుల్లో 1 ఫోరు), అనుష్క సంజీవని(20; 22 బంతుల్లో 2 పోర్లు), అమ కాంచనా(19) పరుగులు చేశారు. భారత మహిళా బౌలర్ల విషయానికొస్తే.. అరుంధతి రెడ్డి, ఆషా శోభాన తలో మూడు వికెట్లు పడగొట్టగా, రేనుకా ఠాకూర్ సింగ్ 2 వికెట్లు తీసింది. ఇక శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్​ వికెట్ పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..