Rohit Sharma: ఎవర్రా గంభీర్.! పొమ్మని పొగబెట్టాక ఎలా వస్తాడురా.. అక్కడున్నది హిట్‌మ్యాన్..

గిల్ గాయం కారణంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్ ఎవరు అవుతారన్న దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. వన్డేలకు రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలను చేపడతాడని టాక్ వినిపిస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

Rohit Sharma: ఎవర్రా గంభీర్.! పొమ్మని పొగబెట్టాక ఎలా వస్తాడురా.. అక్కడున్నది హిట్‌మ్యాన్..
Rohit Sharma

Updated on: Nov 19, 2025 | 7:40 PM

కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో శుభ్‌మాన్ గిల్ మెడ గాయం తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత వన్డే కెప్టెన్సీపై చర్చ మొదలైంది. రెండో టెస్టులో గిల్ జట్టుకు దూరమయ్యే అవకాశం ఉండటంతో.. వన్డేల్లో అతని లభ్యతపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. అటు గిల్, ఇటు వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ కూడా గాయాలతో సతమతమవుతున్నారు. నవంబర్ 30 నుంచి సఫారీలతో వన్డే సిరీస్ మొదలు కానుంది. ఈలోపు గిల్ కోలుకోలేకపోతే.. అతడి స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌ను నియమించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. గిల్ అందుబాటులో లేకపోతే కెఎల్ రాహుల్‌ను ప్రత్యమ్నాయ కెప్టెన్‌గా సెలెక్టర్లు భావిస్తున్నారు. అటు మాజీ క్రికెటర్ కైఫ్ కూడా ఇది కరెక్టేనని అభిప్రాయపడ్డాడు.

అటు సెలెక్టర్లు రోహిత్‌ శర్మను కెప్టెన్సీ విషయంలో సంప్రదించకపోవచ్చునని అభిప్రాయపడ్డారు మాజీ క్రికెటర్లు. ఒకసారి కెప్టెన్సీ నుంచి తప్పించి.. పొగబెట్టి బయటకు పంపించాక.. మళ్లీ ఎందుకు కెప్టెన్ బాధ్యతలను తీసుకుంటాడని అంటున్నారు. కేవలం సలహాలు మాత్రమే ఇచ్చి.. బ్యాటర్‌గా కొనసాగుతాడని పేర్కొన్నారు. కాగా, నవంబర్ 30(రాంచీ), డిసెంబర్ 3(రాయ్‌పూర్), డిసెంబర్ 6(విశాఖపట్నం) తేదీలలో దక్షిణాఫ్రికాతో వన్డేలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. జట్టు ప్రకటనకు ముందే కెప్టెన్సీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.