Team India : గౌతమ్ గంభీర్ సహా ముగ్గురిపై బీసీసీఐ సంచలన నిర్ణయం? టీమిండియాలో భారీ మార్పులు ?

మాంచెస్టర్ టెస్ట్ డ్రా తర్వాత, బీసీసీఐ గౌతమ్ గంభీర్ సహా ముగ్గురిపై పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ ర్యాన్ డెస్కాటే లను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి. సెలెక్టర్లపై కూడా వేటు పడే అవకాశం ఉంది.

Team India : గౌతమ్ గంభీర్ సహా ముగ్గురిపై బీసీసీఐ సంచలన నిర్ణయం? టీమిండియాలో భారీ మార్పులు ?
Manchester Test

Updated on: Jul 28, 2025 | 8:39 AM

Team India : మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంటే, 5 టెస్టుల సిరీస్ స్కోరు ప్రస్తుతం 1-2 గానే కొనసాగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‎తో సహా ముగ్గురిపై బీసీసీఐ త్వరలో కీలక నిర్ణయం తీసుకోవచ్చని చెబుతున్నారు. టీమిండియాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అయితే జట్టు నుంచి తప్పించవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ ఈ చర్యను ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటుంది.

ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం, బీసీసీఐ ఇంగ్లాండ్ పర్యటనలో ఎలాంటి చర్యలు తీసుకోదు. కానీ, ఆసియా కప్ 2025 తర్వాత, ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో సహా ముగ్గురిపై పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ ముగ్గురు అంటే గౌతమ్ గంభీర్ తో పాటు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ ర్యాన్ డెస్కాటే.

బీసీసీఐ అభిప్రాయం ప్రకారం, మోర్నే మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా ఉన్నప్పటికీ భారత జట్టు బౌలింగ్‌లో పెద్దగా మెరుగుదల రాలేదు. ఫీల్డింగ్‌లో ర్యాన్ డెస్కాటే విషయంలో కూడా ఇదే పరిస్థితి. అందుకే వీరిద్దరినీ జట్టు నుంచి తొలగించే అవకాశం ఉంది. టీమిండియా సహాయక సిబ్బందిలో మోర్నే మోర్కెల్, ర్యాన్ డెస్కాటే ల ఎంట్రీ అనేది గౌతమ్ గంభీర్ చెప్పడం వల్లే జరిగింది. అయితే గౌతమ్ గంభీర్ ను బీసీసీఐ హెడ్ కోచ్‌గా కొనసాగించవచ్చు.

బీసీసీఐ ప్రస్తుతం గౌతమ్ గంభీర్‌కు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది, తద్వారా అతను జట్టును మార్పుల దశ నుండి బయటకి తీసుకురాగలడు. ఈ నివేదికలో బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, సెలెక్టర్ శివ్ సుందర్ దాస్‎లపై కూడా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ తీవ్రంగానే ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..