Dinesh Karthik: ఒక అర్ధాంగి జీరోను చేసి వెళ్లిపోతే.. మరో అర్ధాంగి వచ్చి హీరోని చేసింది.. దినేష్ కార్తీక్ బౌన్స్ బ్యాక్

|

Jun 23, 2022 | 8:11 PM

ప్రస్తుత టీమిండియాలోనే వెటరన్‌ అతడు. పెద్దోడే కాని.. యువకులతోనే పోటీపడే ఆట అతడిది. దాదాపు ఫేడ్ఔట్‌‌ అయిన దగ్గర నుంచి.. టీమిండియా ప్రస్తుత బెస్ట్‌ ఫినిషర్‌గా ఎదిగిన అతడు ఓ వారియరే. అలాగని కేవలం ఆటతో మాత్రమే కాదు.. అతడి లైఫ్ స్టోరీ.. ఎందరో యువకులకు ఇప్పుడొక ఇన్స్‌పిరేషన్.

Dinesh Karthik: ఒక అర్ధాంగి జీరోను చేసి వెళ్లిపోతే.. మరో అర్ధాంగి వచ్చి హీరోని చేసింది.. దినేష్ కార్తీక్ బౌన్స్ బ్యాక్
Dinesh Karthik Life Story
Follow us on

Dinesh Karthik Profile ఒకప్పుడు బెస్ట్ ఫినిషర్ గా ఉన్న ధోనీ(Ms Dhoni) కి నేడు సరి జోడి ఎవరో తెలుసా? ఎంతటి కష్ట సాధ్యమైన లక్ష్యమైనా.. తుక్కు కింద కొట్టగల డ్యాషింగ్ ప్లేయర్ ఎవరో తెలుసా? ప్రెజంట్ ఆ నేమ్ అండ్ ఫేమ్ దినేష్ కార్తిక్ పేరిట ఉంది. ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు ఈ ఆటగాడు.  ఒకప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్(kolkata knight riders)కి కెప్టెన్ గా చేసిన దినేష్ తర్వాత ఆ జట్టు ఐపీఎల్ ఛాంపియన్ కాక పోవడంతో దినేష్ ను రిజెక్ట్ చేయడం. తర్వాత డీకే- ఆర్సీబీసికి సెలక్ట్ కావడం.. ఇదిగో ఇప్పుడిలా మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్లేయర్ గా ఎదగడం.. ఒక గ్రేట్ కెరీర్ ఓరియెంటెడ్ స్టోరీ. కానీ ఇదే దినేష్ నాణానికి మరో వైపు కూడా ఉంది.. అదే అతడి ఫెయిల్యూర్ పర్సనల్ లైఫ్..

దినేష్ కార్తిక్ అందరి క్రికెటర్ల లాంటి క్రికెటర్ కాదు.. తన వ్యక్తిగత జీవితంలో అతడొక దగాపడ్డ వ్యక్తి.. తన చిన్ననాటి స్నేహితుడు మురళీ విజయ్ చేసిన నమ్మక ద్రోహానికి బలయ్యాడు. ఫ్రెండే కదాని దగ్గరకు తీస్కుంటే.. దినేష్ జీవితాన్నే తీసుకెళ్లిపోయాడు మురళీ.. ఫ్రెండ్ తన గుండెల మీద కొట్టిన స్ట్రోక్ కి.. ఇంకొకరైతే ఈ పాటికి అటో ఇటే తేల్చేసి ఉండేవారు. కానీ దినేష్ ఇటు ఆటలో రాణించలేక.. అటు స్నేహితుడితో ప్రేమలో పడ్డ భార్యను ఏమీ చేయలేక.. నిరాశా నిస్పృహలను నిశ్శబ్దంగా అనుభవించడం మొదలు పెట్టాడు. అంతే కాదు.. ఒక దశలో ఆత్మహత్య చేసుకుందామా? అన్న మానసిక స్థితికి వెళ్లి పోయాడు. మోడ్రన్ లైఫ్ స్టైల్ కి బలైన క్రికెటర్లలో దినేష్ కార్తిక్ ముందు వరుసలో నిలుస్తాడు. ఇంతకీ దినేష్ విషయంలో అంతగా ఏం జరిగిందంటే.. దినేష్ కార్తిక్- మురళీ చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్.. దినేష్ కి క్రికెట్ అంటే అంతులేని ప్రేమ. ఎప్పటికైనా ధోనీకి సాటిరాగల క్రికెట్ కీపర్ కమ్ డ్యాషింగ్ బ్యాట్స్ మన్ గా .. ఎదగాలన్నది అతడి లైఫ్ టైం డ్రీం. అందులో భాగంగానే రంజీల్లో రాణించి, తమిళనాడు కెప్టెన్ స్థాయికి చేరాడు. అక్కడి నుంచి 2004లో ఇండియన్ క్రికెట్ టీంకి సెలెక్టయ్యాడు. అలా ఇండియన్ క్రికెట్ ప్లేయర్ గా ఎదుగుతూ వచ్చిన దినేష్ కి ఫ్యామిలీ ఫ్రెండ్ నికితతో పెళ్లయ్యింది. ఇద్దరి వైవాహిక జీవితం ఎంతో సజావుగా సాగుతోంది..

దినేష్ కార్తిక్ తో పాటు మురళీ విజయ్ కూడా కాల- క్రమేణా ఇండియన్ క్రికెట్ లో ఎదుగుతూ వచ్చాడు. టీం ఇండియా మెంబరయ్యి.. దినేష్ కి సమాంతరంగా మురళి సైతం పేరు సాధిస్తూ వచ్చాడు. ఈ దశలో ఇద్దరు మిత్రుల మధ్య ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ గట్టిగా నడిచింది. సరిగ్గా ఇదే సమయంలో మురళీ విజయ్- దినేష్ కార్తిక్ భార్య నికితల మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరి సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో వారిద్దరూ కలసి దినేష్ కి తెలీకుండా తమ రహస్య స్నేహాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయం ఆ నోటా ఈ నోట విన్న దినేష్ ఒక్కసారిగా షాకయ్యాడు. అంతే కాదు తన చిన్ననాటి స్నేహితుడు చేసిన మోసం నుంచి ఎలా బయట పడాలో అర్ధం కాక.. అయోమయ స్థితికి చేరిపోయాడు. నికితకు విడాకులిచ్చే సమయానికి ఆమె గర్భవతి. చేసేది లేక.. ఆమె నుంచి దూరమైన దినేష్.. తర్వాత తీవ్ర నిరాశనిస్పృహల్లోకి జారుకున్నాడు. ఒక దశలో దినేష్ కి క్రికెట్ దూరమై పోయింది.. అంచెలంచెలుగా ఎదుగుతూ రావల్సిన వాడుకాస్తా.. జీవితమనే పరమపద సోపాన పటంలో.. పాము రూపంలో ఓ కుదుపు ఎదురవ్వగా.. తిరిగి మొదటికే వచ్చింది దినేష్ కార్తిక్ జీవితం. ఇండియన్ క్రికెట్ నుంచి మాత్రమే కాదు రంజీల నుంచి కూడా బయటకొచ్చేశాడు. వింత ఏంటంటే తమిళనాడు కెప్టెన్ గా అతడి స్థానంలో మురళీ విజయ్ సెలెక్టయ్యాడు. ఈ అవమాన భారం భరించలేక- దినేష్ సూసైడ్ ఆలోచనలు చేశాడని అతని సన్నిహితుల ద్వాారా తెలిసింది.

ఈ విషయం తెలిసిన ఓ ఫిట్‌నెస్ ట్రైనర్ దినేష్ ను కలిసి.. తిరిగి జిమ్ కి రావల్సిందిగా కోరాడు. అతడు ఒప్పుకోకున్నా బలవంతానా జిమ్ కి వచ్చేలా చేశాడు. ఎప్పటిలాగానే మాములు మనిషి అయ్యే క్రమంలో అతడికో తోడు దొరికింది. ఆ తోడు-నీడ పేరే దీపిక పల్లికల్. దీపిక మహిళల ఇండియన్ స్క్వాష్ ఛాంపియన్. బేసిగ్గా క్రికెటర్లంటే పెద్ద అభిప్రాయం లేని.. దీపికకు ఎందుకనో దినేష్ ను చూడగానే ఒకింత మంచి ఒపీనియన్ ఏర్పడింది. దీంతో అతడితో స్నేహం పెంచుకుంది.. అప్పటి నుంచి దినేష్ జీవితంలో ఒక కొత్త సూర్యోదయం. ఇరువురి మనసులు కలిశాయి. దీపిక- దినేష్ ల పెళ్లికి మార్గం సుగమం అయ్యింది. ఇద్దరి వివాహ బంధం ముడి పడ్డంతో.. తిరిగి దినేష్ కార్తిక్ ఎప్పటిలాగానే తనదైన ఛాంపియన్ ఆటతీరును కొనసాగించడం మొదలు పెట్టాడు. ఇవాళ దినేష్ కార్తిక్ ఓల్డెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీం. ఇంగ్లండ్ వెళ్లే.. టీ- 20 టీంలోకి గ్రాండ్ గా రీ- ఎంట్రీ ఇచ్చాడు.

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహా పురుషులవుతారు.. అనడానికి డీకే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రస్తుతం దీపిక- దినేష్ దంపతులకు కవల పిల్లలు. అంతే కాదు దినేష్ తో పాటు పెళ్లయ్యాక దీపిక కూడా ఇండియన్ స్క్వాష్ డబుల్స్ లో ఛాంపియన్ నిలవడం కొసమెరుపు. ఒకప్పుడు మురళీ విజయ్ అనే చిన్ననాటి స్నేహితుడు, తన ఫస్ట్ వైఫ్ నికిత చేసిన మోసం కారణంగా.. ఇండియన్ క్రికెట్ టీం నుంచి దూరం కావడం మాత్రమే కాదు.. రంజీ, తమిళనాడు కెప్టెన్సీ, ఐపీఎల్ సర్వస్వం కోల్పోయి.. ఒక దశలో దేవదాసుగా మారి.. ఆత్మహత్య చేసుకుందామా? అనే వరకూ వచ్చి.. తిరిగి జిమ్ ట్రైనర్ పుణ్యమాని వర్కవుట్లు చేస్తూ.. దీపిక పల్లికల్ తో ప్రేమ పెళ్లి.. ధోనీ కారణంగా తిరిగి తన కెరీర్ గాడిన పడ్డంతో.. దినేష్ కార్తిక్.. ఇప్పడొక ఇన్ స్పిరేషనల్ స్టోరీ. ఒక సినిమా తీయడానికి వీలున్నంత ఆటో బయోగ్రఫీ గల స్పోర్ట్స్ పర్సనాల్టీ.

అందుకే అంటారు.. జీవితం అయిపోయిందనుకున్న చోటే మొదలవుతుందని. కాకుంటే ఆ సమయం వచ్చే వరకూ మన మీద మనకు నమ్మకం ఉండాలి. అందుకు తగిన ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంటూ రావాలి. ఒకానప్పుడు తనకు ద్రోహం చేసిన ఫ్రెండ్- మురళీ విజయ్ కెరీర్ ప్రజంట్ నామరూపాల్లేకుండా పోతే.. 37 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లతో పోటీగా దినేష్ చేస్తున్న ఈ డ్యాషింగ్ నాక్.. ఎందరో క్రికెటర్లకు .. ఆ మాటకొస్తే సామాన్యులకు కూడా ఒక ఆదర్శనీయం. పడిలేచిన కెరటం లాంటి దినేష్ సెకండ్ ఇన్సింగ్స్ మరింత సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుతూ.. ఆల్ ద బెస్ట్ డీకే.. ఇట్స్ యువర్ టైం.. నాక్ వన్స్ అండ్ వన్స్ అగైన్.. హ్యావే గ్రేట్ కెరీర్.. ఇన్ టీం ఇండియా అంటూ విష్ చేస్తున్నారు డీకే ఫ్యాన్స్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..