వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిడ్జ్‌టౌన్‌లోని తొలి టీ20లో ఇంగ్లీష్ జట్టు ఓటమిపాలయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 19.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. లోయర్ ఆర్డర్‌లో ఆడిన క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ రాణించడంతో ఇంగ్లీష్ జట్టు ఆ మాత్రం స్కోరు చేసింది. జోర్డాన్ 28 పరుగులు, రషీద్ 22 పరుగులు చేశారు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 17 పరుగులు చేయగా, జేమ్స్ విన్స్ 14 పరుగులు చేశాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ కేవలం 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాట్రెల్ 2 వికెట్లు పడగొట్టాడు.
లక్ష్యా ఛేదనకు దిగిన వెస్టిండీస్ ఒక వికెట్ కోల్పోయి 17 బంతుల్లో మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్ బ్రెండన్ కింగ్ 49 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 7 పరుగులకే ఇంగ్లండ్ 4 వికెట్లు పడగొట్టిన జాసన్ హోల్డర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. రెండో టీ20 జనవరి 23న జరగనుంది.
Read Also.. Legends League: 69 బంతుల్లో 140 పరుగులు చేసిన మాజీ వికెట్ కీపర్.. అయినా ఓడిపోయినా ఇండియా మహారాజా