0,4,0,0,0,2.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే

West Indies vs Australia: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 225 పరుగులు చేయగా, వెస్టిండీస్ 143 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది.

0,4,0,0,0,2.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డ్.. అసలు మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాంకే
West Indies Vs Australia

Updated on: Jul 15, 2025 | 9:03 PM

West Indies vs Australia: టెస్ట్ ఇన్నింగ్స్‌లో టాప్ ఆరుగురు బ్యాటర్లు కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయడం ఎప్పుడైనా చూశారా..? తాజాగా ఓ జట్టు బ్యాటర్లు ఈ చెత్త రికార్డులో చోటు దక్కించుకున్నారు. ఈ ఆరు పరుగులతో, వెస్టిండీస్ జట్టు టెస్ట్ చరిత్రలో చెత్త ఆరంభాన్ని పొందిన అవాంఛనీయ రికార్డును కలిగి ఉంది. ఈ చెత్త రికార్డు గతంలో ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇప్పుడు వెస్టిండీస్ పేరటి నమోదైంది.

జమైకాలోని సబీనా పార్క్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో నాల్గవ ఇన్నింగ్స్‌లో 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత, క్లెవాన్ ఆండర్సన్ 0, మైఖేల్ లూయిస్ 4 పరుగులు చేసి తన వికెట్‌ను వదులుకోగా, బ్రాండన్ కింగ్స్ 0, రోస్టన్ చేజ్ 0 డకౌట్‌గా తమ వికెట్లను సమర్పించుకున్నారు. షాయ్ హోప్ 2 పరుగుల వద్ద ఔటయ్యాడు.

దీంతో, వెస్టిండీస్ జట్టులోని టాప్ ఆరుగురు బ్యాట్స్‌మెన్ కలిసి కేవలం 6 పరుగులు మాత్రమే చేశారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టాప్-6 బ్యాట్స్‌మెన్ కలిసి చేసిన అత్యల్ప స్కోరు ఇది. దీంతో, వెస్టిండీస్ బ్యాటర్లు ఆస్ట్రేలియా జట్టు పేరిట పేలవమైన రికార్డును సృష్టించారు.

అంతకుముందు, ఆస్ట్రేలియా జట్టులోని టాప్-6 బ్యాటర్లు 12 పరుగులు చేసి చెత్త రికార్డును కలిగి ఉన్నారు. ఇది అత్యంత చెత్త ప్రదర్శన. 1888లో సిడ్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాప్-6 బ్యాటర్లు 12 పరుగులు చేసి వికెట్లు సమర్పించుకున్నారు. తాజాగా వెస్టిండీస్ ఇలాంటి దారుణమైన ప్రదర్శనతో భారీ అవమానాన్ని చవిచూసింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 225 పరుగులు చేయగా, వెస్టిండీస్ జట్టు 143 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 121 పరుగులకే ఆలౌట్ అయింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయి, టెస్ట్ చరిత్రలో స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అయిన జట్టుగా నిలిచింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..