IND vs AUS: వామ్మో.. రోహిత్ బరువు తగ్గడానికి అసలు కారణం ఇదా.. సీక్రెట్ చెప్పిన క్లోజ్ ఫ్రెండ్..!

IND vs AUS, Rohit Sharma: రోహిత్ ఇటీవల బహిరంగంగా కనిపించడంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ లేనంత ఫిట్‌గా కనిపించాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను తిరిగి ప్రారంభించడానికి ముందు అతను నాయర్‌తో కలిసి ముంబైలో వారాలపాటు తన ఫిట్‌నెస్ కోసం పనిచేసినట్లు సమాచారం.

IND vs AUS: వామ్మో.. రోహిత్ బరువు తగ్గడానికి అసలు కారణం ఇదా.. సీక్రెట్ చెప్పిన క్లోజ్ ఫ్రెండ్..!
Rohit Sharma

Updated on: Oct 17, 2025 | 6:29 PM

Rohit Sharma Transformation: రోహిత్ శర్మ బరువు చుట్టూ జరిగిన చర్చలు హిట్‌మ్యాన్‌ను ఎంతో ప్రేరేపించాయని భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వెల్లడించారు. కొన్ని నెలల క్రితం ఆయన విమానాశ్రయంలోని ఫొటోలు ఈ ప్రేరణకు కారణమయ్యాయి. ఆ ఫొటోలు రోహిత్ బరువు తగ్గాలనే ప్రయాణాన్ని ప్రారంభించడానికి ప్రేరణనిచ్చాయి. రోహిత్ సన్నిహితులలో ఒకరైన నాయర్ మాట్లాడుతూ, రోహిత్ “ఆరోగ్యంగా, వేగంగా, ఫిట్‌గా” మారడానికి చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు.

నాయర్‌తో కలిసి ఫిట్‌నెస్‌పై ఫోకస్..

రోహిత్ ఇటీవల బహిరంగంగా కనిపించడంతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఎప్పుడూ లేనంత ఫిట్‌గా కనిపించాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను తిరిగి ప్రారంభించడానికి ముందు అతను నాయర్‌తో కలిసి ముంబైలో వారాలపాటు తన ఫిట్‌నెస్ కోసం పనిచేసినట్లు సమాచారం. బరువు తగ్గాలనే రోహిత్ నిర్ణయం వ్యక్తిగతమైనదని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నాయర్ అన్నాడు.

2027 ప్రపంచ కప్ ఆడటంలో అడ్డంకిగా..!

38 ఏళ్ల రోహిత్ దాదాపు ఏడు నెలలుగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను ఇప్పటికే టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. తత్ఫలితంగా, గత కొన్ని నెలలుగా అతను ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. ఇది 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాలనే అతని లక్ష్యానికి అడ్డంకిగా మారిందని చాలామంది తెలిపాడు. ఇటీవల, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, అతన్ని భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో 26 ఏళ్ల శుభ్‌మాన్ గిల్‌ను నియమించారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ భారత్ తరపున ఎన్ని వన్డే మ్యాచ్‌లు ఆడాడంటే?

రోహిత్ భారతజట్టు తరపున 27 వన్డేలు ఆడి 48.76 సగటుతో 11,168 పరుగులు చేశాడు. 92.80 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. అతని ఖాతాలో 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

రోహిత్ భారత జట్టు తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు ఆడాడంటే?

ఈ ఏడాది మార్చి 9న న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో రోహిత్ భారత జట్టు తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..