IND vs SL: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో శిఖర్ సేన ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కీలక ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా లోస్కోర్ నమోదు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో కాస్త ఉత్కంఠ రేకెత్తించినా.. చివరకు గెలుపు లంకనే వరించింది. ఈ నేపథ్యంలో నేడు మూడవది, చివరదైన మూడవ టీ20 జరగనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో ఇరుజట్లు చెరో విజయం సాధించి సమంగా నిలిచాయి. నేటి నిర్ణయాత్మక మ్యాచులో ఎవరిది విజయమో.. టీ20 సిరీస్ కూడా ఆ జట్టుకే సొంతం కానుంది. ఈ మ్యాచులో విజయం సాధించేందుకు ఇరుజట్లు చివరిదాక ప్రయత్నిస్తాయనడంలో సందేహం లేదు. హోరాహోరీగా జరగనున్న ఈ మ్యాచులో టీమిండియా తరపున మరో ఆటగాడు అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
నవదీప్ ఆటపై సస్పెన్స్, మరో ఆటగాడు అరంగేట్రం చేసే ఛాన్స్..
మూడవ లేదా చివరి టీ20 కోసం భారతదేశం ఆడుతున్న ఎలెవన్‌లో పెద్దగా మార్పు లేకపోవచ్చు. జులై 28 న ఆడిన రెండవ టీ20 జట్టే దాదాపుగా ఉండొచ్చు. అయితే, నవదీప్ సైని రూపంలో మరో ఆటగాడు నేడు టీ20లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అలాగే ఒకవేళ నవదీప్‌కు ఛాన్స్ రాకపోతే అర్షదీప్ సింగ్ టీ20 అరంగేట్రం చేసే అవకాశం ఉంది. టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు కరోనా కారణంగా, రెండవ టీ20 లో నలుగురు ఆటగాళ్ల అరంగేట్ర చేశారు. రితురాజ్, దేవదత్, రానా, చేతన్ సకారియాలు నేడు కూడా బరిలోకి దిగనున్నారు.
బౌలింగ్ బాధ్యతలు భువికే..
ఈ రోజు జరగబోయే నిర్ణయాత్మక టీ 20 లో ధావన్, రితురాజ్ భుజాలపై ఇన్నింగ్స్ ఆధారపడి ఉంది. వీరిద్దరు గొప్ప ఆరంభం అందిస్తేనే టీమిండియా పోరాడగలదు. దేవదత్, రానా, శాంసన్ మిడిల్ ఆర్డర్‌లో తమ బ్యాట్‌లను ఝులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్‌లో వైస్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. స్పిన్ విభాగం బాధ్యతను కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిలు తీసుకోనున్నారు.
మూడో టీ 20 కోసం టీమిండియా ఎలెవన్:
శిఖర్ ధావన్, రితురాజ్ గైక్వాడ్, దేవదత్ పాడికల్, నితీష్ రానా, సంజు శాంసన్, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మరియు నవదీప్ సైని / అర్షదీప్ సింగ్
శ్రీలంక: అవిష్క ఫెర్నాడో, భానుకా , ధనంజయ డిసిల్వా, సమరవికరరామా , షనకా , రమేష్ మెండిస్, హసరంగా, చమిక కరుణరత్నే, ఉదానా, అఖిల ధనంజయ, చమీరా
Also Read: IND Vs SL: మైదానంలోకి చిట్టీ పంపిన రాహుల్ ద్రవిడ్.. అందులో ఏముందంటూ నెటిజన్ల కామెంట్లు..!
Mirabai Chanu: మీరాబాయికి బంపరాఫర్.. ఇకపై జీవితాంతం ఉచితంగా సినిమా చూడొచ్చు..
Viral Photo: అంతరిక్షం నుంచి ఒలింపిక్ వెలుగులు.. నెట్టింట్లో వైరలవుతోన్న నాసా ఫొటో