
ఈ ప్లేయర్ పుట్టింది ఇండియాలో.. కానీ అదరగొడుతున్నది ఆస్ట్రేలియాలో.. అవునండీ.! మీరు విన్నది నిజమే. ఓ భారత ప్లేయర్ ఆస్ట్రేలియాలోని బిగ్ బ్యాష్ లీగ్‌లో చెలరేగిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్ వద్దంటే.. బీబీఎల్ రారమ్మంది.. హోబర్ట్ హర్రికేన్స్ జట్టు తరపున ఈ సీజన్‌తో బరిలోకి దిగాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. పంజాబీ ప్లేయర్ నిఖిల్ చౌదరి.
పంజాబ్‌కు చెందిన 27 ఏళ్ల ఆల్ రౌండర్ నిఖిల్ చౌదరి, హోబర్ట్ హర్రికేన్స్ తరఫున తన అద్భుతమైన ప్రదర్శనలతో బిగ్ బాష్ లీగ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ మాదిరిగా ఫాస్ట్ బౌలర్ అవ్వాలనే కోరికతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్ చౌదరి.. తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుని డైనమిక్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఇటీవల సిడ్నీ థండర్స్‌తో జరిగిన BBL మ్యాచ్‌లో, చౌదరి లీగ్‌లో తన మొట్టమొదటి వికెట్‌ను పడగొట్టడమే కాకుండా.. శిఖర్ ధావన్ సిగ్నేచర్ స్టైల్‌ను కూడా రీ-క్రియేట్ చేశాడు. భారత్ తరపున U-19 క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు నిఖిల్ చౌదరి. అతడు మెల్‌బోర్న్ స్టార్స్‌పై కేవలం 16 బంతుల్లోనే 32 పరుగులు చేసి హరీస్ రౌఫ్ లాంటి ఫాస్ట్ బౌలర్‌కు చుక్కలు చూపించాడు.
కుటుంబసభ్యులతో సెలవులకు ఆస్ట్రేలియా వచ్చిన నిఖిల్ చౌదరికి.. అనుకోని అదృష్టం తలుపు తట్టింది. స్థానికంగా కొరియర్ బాయ్‌గా విధులు నిర్వర్తిస్తూ.. నార్తర్న్ సబర్బ్స్ కోసం క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతడి ప్రతిభ మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ జేమ్స్ హోప్స్ దృష్టిలో పడింది. తద్వారా హోబర్ట్ హరికేన్స్‌లో బీబీఎల్ కాంట్రాక్ట్ దక్కింది. హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాలతో కలిసి పంజాబ్ జట్టులో ఆడి.. క్రికెట్‌లో మెలుకువలు నేర్చుకున్నాడు నిఖిల్ చౌదరి. అతడు ఐపీఎల్‌లో స్థానం దక్కించుకోలేకపోయినా.. బీబీఎల్‌లో మాత్రం హోబర్ట్ హరికేన్స్ జట్టుకు కీలక జట్టు సభ్యుడిగా మారాడు.
Nikhil Chaudhary, the second Indian-born BBL player, has his first wicket! This man has a big future in the competition. #BBL13 pic.twitter.com/wHctiTEmRt
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) January 1, 2024