Cricket Bat: ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్‌ ఇదేనట.. దీన్ని ఎవరు వాడారో తెలుసా?

Most Expensive Cricket Bat In The world: క్రికెట్ అనేది ఒక ఆట మాత్రమే కాదు.. క్రికెట్ అంటే ఒక ఏమోషన్. క్రికెట్‌లో బ్యాట్‌ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యాచ్‌లో భాగా స్కోర్ చేసేందుకు కొందరు క్రికెటర్లు.. తమ బ్యాట్‌లను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటారు. ఇవి ఎంతో ఖరీదు ఉంటాయి. అలానే కొన్ని కీలక మ్యాచ్‌లలో క్రికెట్ దిగ్గజాలు వాడిన బ్యాట్‌లను వేలం వేస్తుంటారు. అప్పుడు అవి రికార్డు స్థాయిలో అమ్ముడవుతాయి. ఇలా ప్రపచంలో అత్యధిక ధరకు అమ్ముడైన, ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్‌ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం.

Cricket Bat: ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్‌ ఇదేనట.. దీన్ని ఎవరు వాడారో తెలుసా?
Most Expensive Cricket Bat
Image Credit source: ABC News

Updated on: Jan 04, 2026 | 7:35 AM

ప్రపంచంలో అత్యంత ఖరీదైన క్రికెట్ బ్యాట్ ఏది? అనే ప్రస్థావన వస్తే.. మొదటగా వినిపించే పేరు ఆస్ట్రేలియన్ క్రికెట్ లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మాన్‌.. ఎందుకంటే ఈయన వాడిన బ్యాటే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా పరిగణించబడుతుంది. ఈ బ్యాట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విలువైన బ్యాట్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ క్రియేట్ చేసింది. బ్రాడ్‌మాన్ అసాధారణ బ్యాటింగ్ విజయాలు ఈ బ్యాట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చాయి.

సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ 1934 యాషెస్ టెస్ట్ సిరీస్‌ లో ఈ బ్యాట్‌ను ఉపయోగించారు. ఈ సిరీస్‌లో, బ్రాడ్‌మాన్ ఇంగ్లాండ్‌పై అసాధారణ ప్రదర్శన చేశాడు. ఈ బ్యాట్‌తో బ్రాడ్‌మన్ లీడ్స్‌లో 304 పరుగులు, ది ఓవల్‌లో 244 పరుగులు చేశాడు చేసి రికార్డులు సృష్టించాడు. ఈ బ్యాట్‌తోనే బ్రాడ్‌మన్ బిల్ పొన్స్‌ఫోర్డ్‌తో కలిసి 451 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. బ్రాడ్‌మన్ సృష్టించిన రికార్డులతో ఈ బ్యాట్‌ ఎంతో కీలకంగా నిలిచింది.అయితే 2021లో జరిగిన ఆన్‌లైన్ ఆక్షన్‌లో ఈ బ్యాట్ ఎవరూ ఊహించని విధంగా సుమారు రూ. 1.9 కోట్లు (245,000 AUD, దాదాపు 174,000 USD)కు అమ్ముడైంది. దీంతో ఈ బ్యాట్‌ ప్రపంచలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా నిలిచింది.

నివేదికల ప్రకారం.. క్రికెట్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తానికి ఇంతవరకు ఏ బ్యాట్ అమ్ముడుపోలేదు! అయితే ఈ బ్యాట్‌ను వేలంలో దక్కించుకున్న వ్యక్తి దాన్ని తన వద్ద పెట్టుకోకుండా ఆస్ట్రేలియాలోని బౌరాల్‌లోని డాన్ బ్రాడ్‌మాన్ మ్యూజియంకు విరాళంగా ఇచ్చాడు. ఈ బ్యాట్‌ను మీరు ఇప్పటికీ ఆ మ్యూజియంలో చూడవచ్చు. అయితే ఈ బ్యాట్‌కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, సర్ డాన్ బ్రాడ్‌మాన్ స్వయంగా తన ఇన్నింగ్స్ వివరాలను బ్యాట్‌పై రాసుకున్నాడు. అతను ఏ మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశాడనేది మొత్తం ఈ బ్యాట్‌పై ఉంటుంది. అందుకే ఈ బ్యాట్‌కు ఇంత క్రేజ్ వచ్చింది.

Most Expensive Cricket Bat

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.