IND Vs SA: టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌.! డబ్ల్యూటీసీలో టీమిండియాకు డబుల్ షాక్.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే

గౌహతి టెస్టులో టీమిండియా ఓటమి ఖరారైంది. ఈ ఓటమితో వైట్ వాష్ కన్ఫర్మ్ అయింది. అయితే ఈ ఓటమితో డబ్ల్యూటీసీలో భారత్ పొజిషన్ చేంజ్ కానుంది. మరి ఆ ఈక్వేషన్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.? ఓ సారి లుక్కేయండి మరి.

IND Vs SA: టెస్ట్ సిరీస్ వైట్‌వాష్‌.! డబ్ల్యూటీసీలో టీమిండియాకు డబుల్ షాక్.. తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే
Indian Team

Updated on: Nov 26, 2025 | 11:35 AM

దాదాపుగా గౌహతి టెస్ట్‌లో టీమిండియా ఓటమికి దగ్గరైంది. వైట్‌వాష్ ఖాయం కావడంతో ఈ ఓటమితో డబ్ల్యూటీసీలో టీమిండియాకు డబుల్ షాక్ తగలనుంది. ఇప్పటికే ఆరు వికెట్లు కోల్పోయినా.. మిగిలిన నాలుగు వికెట్లతో టీమిండియా డ్రా చేయడం కష్టమే. ఇక ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోతే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఆ ఓటమితో డబ్ల్యూటీసీలో టీమిండియా ప్లేస్ ఎలా మారుతుంది.? భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో టీమిండియా 8 మ్యాచ్‌లు ఆడింది. 9వ మ్యాచ్ గౌహతిలో జరుగుతోంది. 8 మ్యాచ్‌లలో టీమిండియా 4 గెలిచింది.. 3 ఓడిపోయింది. ఒకటి డ్రా చేసుకుంది. 54.17 విజయశాతంతో భారత జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది.

ఆస్ట్రేలియా 4 మ్యాచ్‌లలో నాలుగింట గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో నిలిచాయి. గౌహతిలో జరిగే మ్యాచ్‌లో టీం ఇండియా ఓడిపోతే, ఆ జట్టు విజయశాతం 50కి పడిపోతుంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో నిలుస్తుంది. పాకిస్తాన్ కూడా పాయింట్ల పట్టికలో 50 విజయశాతంతో ఉంది. కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 1-1తో సమం చేసింది. పాకిస్తాన్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. అయితే గౌహతి టెస్ట్‌లో భారత్ ఓడిపోతే.. పాకిస్తాన్ కంటే దిగువకు చేరుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఒక జట్టు ఒక మ్యాచ్ గెలిచినందుకు 12 పాయింట్లు, ఓడిపోతే 0, డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు పొందుతుంది. ఒక జట్టు 5 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలోనూ గెలిచినట్లయితే దానికి 60 పాయింట్లు, 100 విజయశాతం ఉంటుంది. అది 5 మ్యాచ్‌లలో 4 గెలిచి ఒక మ్యాచ్‌లో ఓడిపోతే 48 పాయింట్లు దక్కుతాయి.