CSK: మొయిన్ అలీని ఎందుకు రిటైన్ చేసుకున్నామంటే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎస్‎కే సీఈవో..

|

Dec 02, 2021 | 10:34 AM

ఐపీఎల్-2022 రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లపై చర్చలు జరుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది...

CSK: మొయిన్ అలీని ఎందుకు రిటైన్ చేసుకున్నామంటే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎస్‎కే సీఈవో..
Ali
Follow us on

ఐపీఎల్-2022 రిటెన్షన్ ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లపై చర్చలు జరుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. రవీంద్ర జడేజా, MS ధోనీ, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌ను రిటైన్ చేసుకుంది. జడేజాను రూ.16 కోట్లకు అట్టిపెట్టుకోగా, ధోనీ రూ.12 కోట్లు, అలీ రూ.8 కోట్లు, గైక్వాడ్ రూ.6 కోట్లకు దక్కించుకుంది. అయితే మెయిన్ అలీ రిటెన్షన్‎పై సీఎస్‎కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడారు. IPL 2022 కోసం డిఫెండింగ్ ఛాంపియన్‌లతో కలిసి ఉండటానికి మొయిన్ అలీ ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. ఇతర ఫ్రాంచైజీ కోసం ఆడటం గురించి కూడా ఆలోచించడం లేదని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ తమతో చెప్పాడని చెప్పాడని తెలిపారు.

IPL 2021లో జరిగిన వేలంలో CSK రూ. 7 కోట్లకు మొయిన్ అలీని కొనుగోలు చేసింది. ఈ ఇంగ్లండ్ స్టార్ సీఎస్‎కే తరఫున 15 మ్యాచ్‌లలో 357 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు. CSK నాలుగోసారి టైటిల్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ” మేము మొదట మొయిన్‌తో మాట్లాడినప్పుడు ఇచ్చిన ఆఫర్‌ నాకు నచ్చింది. వేరే ఫ్రాంచైజీ గురించి అస్సలు ఆలోచించలేదని అతను చెప్పాడు.” అని కాశీ విశ్వనాథన్ అన్నాడు. రుతురాజ్ విషయంలో కూడా అలాగే జరిగిందని కాశీ విశ్వనాథన్ CSKఅ ధికారిక వెబ్‌సైట్‌కి చెప్పారు. “మేము భారతదేశంలో ఆడుతున్నప్పుడు అతను మాకు చాలా ఉపయోగకరమైన ఆల్ రౌండర్ అవుతాడనే భావన మాకు ఎప్పుడూ ఉంటుంది. మేము అతన్ని గత ఏడాది మాత్రమే తీసుకున్నాం” అని పేర్కొన్నాడు.

MS ధోనీ కూడా CSK కోసం ఆడటం కొనసాగిస్తానని చెప్పాడన్నారు. చెన్నైలో తన వీడ్కోలు ఆడాలని నిర్ధారించుకున్న తర్వాత వేతన కోత విధించుకున్నాడని కాశీ విశ్వనాథన్ తెలిపారు. ధోనీ IPL 2022 మొత్తం ఆడతాడో లేదో చూడాలని విశ్వనాథన్ అన్నాడు.

Read Also.. CSA: BCCIతో నిరంతరం టచ్‎లో ఉన్నాం.. దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన ఉంటుంది..

Rohit Sharma: హృదయ విదారకంగా ఉంది.. రిటెన్షన్ తర్వాత రోహిత్ స్పందన..