Sourav Ganguly: దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటన ఉంటుందా.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఏం చెప్పాడంటే..

|

Dec 01, 2021 | 7:21 AM

దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చారు. ఇండియా సౌతాఫ్రికా టూర్ ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్, సౌతాఫ్రికాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు...

Sourav Ganguly: దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటన ఉంటుందా.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఏం చెప్పాడంటే..
Ganguly
Follow us on

దక్షిణాఫ్రికాలో భారత జట్టు పర్యటనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టతనిచ్చారు.  సౌతాఫ్రికా టూర్ ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా కొత్త వేరియంట్, సౌతాఫ్రికాలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఓమిక్రాన్ వేరియంట్‎ను దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా గుర్తించారు. దీంతో ఆ దేశంలో భారత్ పర్యటనపై ఆందోళన పెరుగుతోంది. ” ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో పర్యటన కొనసాగుతోంది. మాకు ఇంకా నిర్ణయించుకోవడానికి సమయం ఉంది. మొదటి టెస్టు డిసెంబర్ 17 ప్రారంభం కానుంది. మేము దాని గురించి ఆలోచిస్తాము.” అని గంగూలీ ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో అన్నారు.

ముంబైలో న్యూజిలాండ్‌తో భారత్ చివరి టెస్ట్ ఆడుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి డిసెంబర్ 8 లేదా 9 న చార్టర్డ్ విమానంలో జోహన్నెస్‌బర్గ్‌కు బయలుదేరుతుంది.” ఆటగాళ్ల భద్రత, ఆరోగ్యం BCCI మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూద్దాం” అని గంగూలీ అన్నారు. ఈ దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడుతుంది. మాజీ భారత కెప్టెన్ కూడా పూర్తి ఫిట్‌నెస్‌కి తిరిగి వచ్చిన తర్వాత జట్టులో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు ఔట్ ఆఫ్ ఫేవర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు మద్దతు ఇచ్చాడు. “అతను మంచి క్రికెటర్. అతను ఫిట్‌గా లేడు, అందుకే అతను జట్టులో లేడు. అతను యువకుడు, గాయం నుండి కోలుకున్న తర్వాత అతను తిరిగి వస్తాడని నేను ఆశిస్తున్నాను” అని దాదా చెప్పాడు. ఇటీవల, దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా పాత్రను ప్రశ్నించాడు. “అతన్ని (హార్దిక్) కపిల్ దేవ్‌తో పోల్చవద్దు. అతను వేరే లీగ్‌కి చెందినవాడు” అని గంగూలీ చెప్పాడు.

Read Also.. CSK IPL 2022 Retained Players: కీలక ప్లేయర్లను వదులుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. జట్టు నుంచి ఎవరెవరు రిలీజ్ అయ్యారంటే..