దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో షాయ్ హోప్ అద్భుత సెంచరీతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. ఆ తర్వాత టెంబా బావుమా మెరుపు సెంచరీతో రాణించినప్పటికీ దక్షిణాఫ్రికా జట్టు 41.4 ఓవర్లలో 287 పరుగులకే కుప్పకూలింది.
వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇది సరైనదని నిరూపణైంది. ఓపెనింగ్ జోడీ బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్ తొలి వికెట్‌కు కేవలం 8.3 ఓవర్లలో 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కింగ్ 30, మేయర్స్ 26 బంతుల్లో 36 పరుగులు చేశారు. ఆ తర్వాత మిడిలార్డర్‌లో కెప్టెన్, వికెట్ కీపర్ షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. అతను కేవలం 115 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయంగా 128 పరుగులు చేశాడు. మిడిలార్డర్‌లో నికోలస్ పూరన్ 39, రోవ్‌మన్ పావెల్ 46 పరుగుల ఇన్నింగ్స్‌లు జట్టును భారీ స్కోరుకు దారితీశాయి. దక్షిణాఫ్రికా తరపున గెరాల్డ్ కోయెట్జీ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా ఆరంభం కూడా చాలా బాగుంది. ఓపెనింగ్ జోడీ క్వింటన్ డి కాక్, కెప్టెన్ టెంబా బావుమా తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 76 పరుగులు జోడించారు. డి కాక్ 26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. అదే సమయంలో టెంబా బావుమా కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 118 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 144 పరుగులు చేశాడు. అయితే అతనికి మిగతా బ్యాట్స్‌మెన్ మద్దతు లభించకపోవడంతో వేగంగా పరుగులు చేసే క్రమంలో జట్టు మొత్తం 41.4 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. వెస్టిండీస్‌లో అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్ 3-3 వికెట్లు తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..