నేడు విండీస్‌తో పాక్ ఢీ

మరో ఆసక్తి కర పోరుకు ప్రపంచ కప్ సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3.00 గంటలకు నాటింగ్‌హమ్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. అయితే ఎప్పుడు ఎలా అడుతుందో తెలియని పాక్‌తో.. వెస్టిండీస్ తలపడుతోంది. అయితే 1975, 1979లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విండీస్.. మళ్లీ ప్రపంచకప్ ను అందుకోలేదు. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో 1992లో ప్రపంచ కప్ ను గెలుచుకున్న పాక్.. మళ్లీ తన ప్రతిభను చూపలేకపోయింది. అయితే 2017లో ఇక్కడే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని […]

నేడు విండీస్‌తో పాక్ ఢీ
Follow us

| Edited By:

Updated on: May 31, 2019 | 11:39 AM

మరో ఆసక్తి కర పోరుకు ప్రపంచ కప్ సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 3.00 గంటలకు నాటింగ్‌హమ్ వేదికగా పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. అయితే ఎప్పుడు ఎలా అడుతుందో తెలియని పాక్‌తో.. వెస్టిండీస్ తలపడుతోంది. అయితే 1975, 1979లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విండీస్.. మళ్లీ ప్రపంచకప్ ను అందుకోలేదు. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో 1992లో ప్రపంచ కప్ ను గెలుచుకున్న పాక్.. మళ్లీ తన ప్రతిభను చూపలేకపోయింది. అయితే 2017లో ఇక్కడే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన పాక్.. అదే స్పూర్తితో దూసుకుపోవాలని భావిస్తోంది. అయితే ప్రపంచ కప్‌లో వెస్టిండీస్, పాకిస్థాన్ ఇప్పటి వరకు పది సార్లు తలపడగా.. ఏడు సార్లు విండీస్ గెలిచింది. పాక్ మాత్రం కేవలం మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే ఇరు జట్లు స్థిరమైన బ్యాంటింగ్ లైనప్ లేకపోవడంతో.. ఈ మ్యాచ్‌లో పైచేయి ఎవరిదో అనేది ఆసక్తి కరంగా మారింది.