Shreyas Iyer Records: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక రికార్డును సాధించాడు. వన్డే కెరీర్‌లో 100 ఫోర్లు పూర్తి చేశాడు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 63 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో అతను 4 ఫోర్లు, ఒక సిక్స్ బాదేశాడు. ఈ మ్యాచ్‌లో ఫోర్ బాది ఈ రికార్డు సృష్టించాడు.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు ముందు శ్రేయాస్ 98 ఫోర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఫోర్లు కొట్టాడు. ఈ విధంగా అతను తన వన్డే కెరీర్‌లో 100 ఫోర్లు పూర్తి చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 29 మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ సమయంలో, అయ్యర్ ఒక సెంచరీ, 11 అర్ధ సెంచరీల సహాయంతో 1064 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో అయ్యర్ అత్యుత్తమ స్కోరు 103 పరుగులుగా నిలిచింది.
ముఖ్యంగా వన్డే క్రికెట్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 463 మ్యాచ్‌ల్లో 2016 ఫోర్లు బాదేశాడు. కాగా ఈ లిస్టులో సనత్ జయసూర్య రెండో స్థానంలో ఉన్నాడు. 445 మ్యాచ్‌ల్లో 1500 ఫోర్లు కొట్టాడు. సంగక్కర 1385 ఫోర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ విషయంలో భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. అతను 1159 ఫోర్లు బాదాడు.