Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్‌ని నియమించడంపై స్పందించిన కోహ్లీ.. సంతోషంగా ఉందంటూ వీడియో విడుదల..

|

Mar 13, 2022 | 3:12 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) సీజన్‌కు ముందు తన వారసుడిగా ఫాఫ్ డు ప్లెసిస్‌(Faf du Plessis)ను నియామకంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)స్పందించాడు...

Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్‌ని నియమించడంపై స్పందించిన కోహ్లీ.. సంతోషంగా ఉందంటూ వీడియో విడుదల..
Virat Kohli
Follow us on

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2022) సీజన్‌కు ముందు తన వారసుడిగా ఫాఫ్ డు ప్లెసిస్‌(Faf du Plessis)ను నియామకంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)స్పందించాడు. ఫాఫ్ డు ప్లెసిస్‌ను కెప్టెన్‌గా నియమించడాన్ని స్వాగతించాడు. శనివారం RCB తమ కొత్త కెప్టెన్‌గా డు ప్లెసిస్‌ని ప్రకటించిన కొద్దిసేపటికే, బెంగళూరుకు చెందిన ఫ్రాంచైజీ కోహ్లీ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. ఆర్‌సీబీ కొత్త కెప్టెన్‌గా డు ప్లెసిస్ నియామకంపై కోహ్లీ తన అభిప్రాయాలను వీడియోలో పంచుకున్నాడు. “మేము త్వరలో మంచి ఆటను ప్రారంభించబోతున్నాం, నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను; నేను చెప్పినట్లు, నిజంగా ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నాను. RCB కెప్టెన్‌గా నాకు బాగా తెలిసిన ఒక మంచి స్నేహితుడికి నియమించడం సంతోషంగా ఉంది” అని కోహ్లీ వీడియోలో పేర్కొన్నాడు.

“మేము ఇప్పుడు చాలా సంవత్సరాలుగా టచ్‌లో ఉన్నాము. క్రికెట్‌తో పాటు నాకు కొంచెం ఎక్కువ పరిచయం ఉన్న కొద్దిమంది వ్యక్తులలో అతను ఒకడు. మేము చాలా బాగా కలిసి ఉంటాము. ” అని భారత మాజీ కెప్టెన్ చెప్పాడు.ఈ సీజన్ కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. “నేను చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాను. ”అని కోహ్లీ చెప్పాడు. ఆర్సీబీ యాజమాన్యం శనివారం ఆ జట్టు కెప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్ నియమించింది. ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌లో చాలా కాలంగా సభ్యుడిగా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఐపీఎల్-2021 తన చివరి సీజన్ అని విరాట్ కోహ్లీ గతేడాది ప్రకటించాడు. 2013 నుంచి విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

Read Also.. Virat Kohli: దాయాది దేశంలో కోహ్లీకి పెరుగుతోన్న క్రేజ్‌.. కరాచీ టెస్టులో ఇంట్రెస్టింగ్‌ ప్లకార్డుతో దర్శనమిచ్చిన పాక్‌ అభిమాని..