Viral Video: చాలు, చాల్లే.. బయటకు పో ఇక.. టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ

Virat Kohli Daryl Mitchell Viral Video: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన నిర్ణయాత్మకమైన మూడవ వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన, సరదా సన్నివేశం చోటు చేసుకుంది. కివీస్ బ్యాటర్ డారిల్ మిచెల్ అద్భుత సెంచరీతో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టినప్పటికీ, అతను అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Viral Video: చాలు, చాల్లే.. బయటకు పో ఇక.. టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
Virat Kohli Daryl Mitchell Viral Video

Updated on: Jan 19, 2026 | 7:20 AM

Virat Kohli Daryl Mitchell Viral Video: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఇండోర్‌లో జరిగిన మూడవ వన్డే మ్యాచ్ పరుగుల వర్షాన్ని కురిపించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 131 బంతుల్లోనే 137 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ బ్యాటింగ్ ధాటికి కివీస్ జట్టు భారత్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది.

మెచ్చుకున్న కోహ్లీ.. ఆపై: డారిల్ మిచెల్ ఆడుతున్న తీరును మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ నిశితంగా గమనించాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాడైనప్పటికీ, మిచెల్ చూపిన అసాధారణ పోరాట పటిమకు కోహ్లీ ఫిదా అయ్యాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మిచెల్ క్యాచ్ అవుట్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి

మిచెల్ పెవిలియన్ వైపు వెళ్తుండగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న విరాట్ కోహ్లీ చప్పట్లు కొడుతూ అతన్ని అభినందించాడు. అయితే అక్కడితో ఆగకుండా, మిచెల్ దగ్గరకు వెళ్లి నవ్వుతూ అతన్ని వెనుక నుంచి నెడుతూ “ఇక చాలు వెళ్ళు” అన్నట్లుగా మైదానం బయటకు పంపించాడు. భారత్‌ను ఇంతసేపు ఇబ్బంది పెట్టినందుకు సరదాగా కోహ్లీ చేసిన ఈ పని కెమెరాకు చిక్కింది.

ఇది కూడా చదవండి: Unique Cricket Facts: కెరీర్‌లో ఒక్క సిక్స్ ఇవ్వని బౌలర్లు.. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే తోపు ప్లేయర్లు భయ్యో

సోషల్ మీడియాలో వైరల్: విరాట్ కోహ్లీకి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కోహ్లీలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ షిప్, అతనిలోని చిలిపితనం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సీరియస్ గేమ్‌లో కూడా ఇలాంటి సరదా సన్నివేశాలు క్రికెట్ అసలైన అందాన్ని చాటుతాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సిరీస్ ఓడిన భారత్: ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. డారిల్ మిచెల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్ కూడా సెంచరీతో రాణించాడు. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా కేవలం 296 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 41 పరుగులతో ఓటమిపాలైంది.

ఇది కూడా చదవండి: Team India: ‘3డీ’ ప్లేయర్ నుంచి బ్యాడ్ లక్కోడి వరకు.. టీమిండియా స్వ్కాడ్ ఎంపికలో 5 వివాదాలు ఇవే

విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, తోటి ఆటగాళ్లను గౌరవించడంలోనూ అంతే ముందుంటాడని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మిచెల్ ఇన్నింగ్స్‌ను అభినందిస్తూనే, అతన్ని సరదాగా ఆటపట్టించడం క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..