Video: టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ.. అసలు మ్యాటర్ తెలిస్తే, కన్నీళ్లే..?

Rohit Sharma Video: టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ప్రస్తుతం తన ఫ్యామిలీతో సమయం కేటాయిస్తున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్ ముగిసిపోవడంతో ఈ దిగ్గజం ఇంటికి చేరుకున్నాడు. అయితే, 3వ వన్డే ముగిసిన తర్వాత హోటల్ గదికి చేరుకునేప్పుడు జరిగిన ఓ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Video: టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ.. అసలు మ్యాటర్ తెలిస్తే, కన్నీళ్లే..?
Rohit Sharma Video

Updated on: Jan 22, 2026 | 2:02 PM

టీమిండియా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లోకి వెళ్లారు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ ముగియడంతో వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధం కానున్నారు. అయితే, ఇండోర్ లో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. భారత జట్టు మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సమయంలో రోహిత్ శర్మ వద్దకు ఓ మహిళ సడన్ గా దూసుకొచ్చింది. ఆయన చేయి పట్టుకుని లాగడంతో ఒక్కసారిగా రోహిత్ శర్మ షాక్ కు గురయ్యాడు. వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవడంతో పరిస్థితిని సర్ధుమణింగింది.

సహాయం ఆవేదన..

కాగా, ఈ మహిళను సరిత శర్మగా గుర్తించారు. ఇలా చేయడం వెనుక గల కారణాన్ని ఆమె వివరిస్తూ.. తన కుమార్తె అనిక ప్రాణాలను కాపాడుకోవాలనే తపనతోనే అలా చేశానని చెప్పుకొచ్చింది. అనిక తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమె ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా ఓ ఇంజెక్షన్ ఇవ్వాలని, దాని ధర సుమారు 9 కోట్ల రూపాయలని, దానిని అమెరికా నుంచి తెప్పించాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు.

విరాళాలతో రూ. 4.1 కోట్లు..

ఇప్పటివరకు విరాళాలతో సుమారు 4.1 కోట్ల రూపాయలు సేకరించామని, మిగిలిన నిధుల కోసం రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ వంటి వారు సహాయం చేస్తారనే ఆశతో అక్కడికి వచ్చినట్లు సరిత వెల్లడించారు.

ప్లీజ్ కాపాడండి..

“నా కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గారు పిల్లలకు సహాయం చేస్తారని తెలిసి వారిని కలవడానికి ప్రయత్నించాను. ఆ ఆవేదనలో రోహిత్ శర్మ చేయి పట్టుకున్నాను. నా ఉద్దేశ్యం సెల్ఫీలు తీసుకోవడం లేదా వారిని ఇబ్బంది పెట్టడం కాదు, కేవలం నా బిడ్డను కాపాడుకోవడమే. నా చర్యకు క్షమాపణలు కోరుతున్నాను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఆటగాళ్ల భద్రతపై ఆందోళన కలిగించినప్పటికీ, ఆ తల్లి పడుతున్న కష్టాన్ని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్రికెట్ బోర్డు (BCCI) లేదా రోహిత్ శర్మ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..