Viral Video: సంచలన క్యాచ్ పట్టిన శ్రీలంక ఆటగాడు.. గాల్లోకి లేచి ఒంటి చేతితో బంతి అందుకున్న బినురా ఫెర్నాండో..

|

Feb 27, 2022 | 11:38 AM

ధర్మశాలలో శనివారం శ్రీలంక, భారత్(INDvsSL) మధ్య జరిగిన 2వ టీ20లో శ్రీలంక ఆటగాడు బినురా ఫెర్నాండో(Binura Fernando) అద్భుతమైన క్యాచ్ పట్టాడు...

Viral Video: సంచలన క్యాచ్ పట్టిన శ్రీలంక ఆటగాడు.. గాల్లోకి లేచి ఒంటి చేతితో బంతి అందుకున్న బినురా ఫెర్నాండో..
Catch1
Follow us on

ధర్మశాలలో శనివారం శ్రీలంక, భారత్(INDvsSL) మధ్య జరిగిన 2వ టీ20లో శ్రీలంక ఆటగాడు బినురా ఫెర్నాండో(Binura Fernando) అద్భుతమైన క్యాచ్ పట్టాడు. భారత ఆటగాడు సంజూ శాంసన్‌( Sanju Samson)ను క్యాచ్‌ను కళ్లు చెదిరే విధంగా పెట్టుకున్నాడు. 13వ ఓవర్‌ను లహిరు కుమార వేశాడు. ఈ ఓవర్లు సంజూ శాంసన్ ఒక ఫోరు, మూడు సిక్స్‌లు కొట్టాడు. చివరి బంతి సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది హెడ్జ్ తీసుకుని స్లిప్‌లోకి వెళ్లింది. దాదాపు ఆ క్యాచ్ పట్టుకోలేమని అనుకుంటాం కానీ బినురా ఫెర్నాండో అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో శాంసన్ 39 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 183 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కేవలం 19 బంతుల్లో 47 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక 53 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఔట్ అయ్యాడు. దీంతో కష్టల్లో ఉన్న భారత్‌ను శ్రేయస్స్ అయ్యర్, శాంసన్ ఆదుకున్నారు. శ్రేయాస్ అయ్యర్ అజేయంగా 74 (44 బంతుల్లో), రవీంద్ర జడేజా అజేయంగా 45 (18 బంతుల్లో) పరుగులు చేశారు. సంజూ శాంసన్ 39 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. భారత్‌ కేవలం మరో విజయంతో ప్రపంచ రికార్డును సమం చేసేందుకు సిద్ధమైంది. ఆఫ్ఘనిస్థాన్ వరుసగా 12 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. సొంతగడ్డపై ఈ ఫార్మాట్‌లో భారత్‌ వరుసగా ఏడో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Read Also.. PAK vs AUS: 24 ఏళ్ల తర్వాత పాక్‌లో అడుగు పెట్టిన ఆస్ట్రేలియా.. టెస్ట్, వన్డే సిరీస్ ఆడనున్న కంగారులు..