Indian Women Cricketers: మనదేశంలోనే కాదు.. క్రికెట్ కు మంచి ఆదరణ ఉన్న దేశాల్లో కూడా పురుషుల జట్టుకుండే ఆదరణ తో పోలిస్తే మహిళల క్రికెట్ కు ఆదరణ తక్కువే.. ఇప్పుడిప్పుడే మహిళా క్రికెట్ జట్టు.. క్రీడాప్రేమికుల ఆదరణ సొంతం చేసుకుంటుంది. మహిళా క్రికెటర్స్ కూడా తమ ఆటతో అభిమానుల ఆదరణ పొందుతున్నారు. ఇక భారత మహిళా క్రికెట్ జట్టులోని మిథాలీ రాజ్, స్మృతి మంధానా వంటి వారు పేర్లు తరచుగా వినిపిస్తుంటాయి. వీరు క్రికెట్ క్రీడాకారిణిలుగా రాణిస్తూ తమకంటూ ఓ ఫేం ను సొంతం చేసుకున్నారు. తాజాగా భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో సత్తా చాటుతూ సంచలనం సృష్టిస్తుంది.
ప్రస్తుతం పలువురు టీమిండియా మహిళల క్రికెటర్లు.. బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు. తాజాగా నేషనల్ ఇండియన్ క్రష్ స్మృతీ మంథానా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఐదుగురు “ఇన్ డా ఘెట్టో” సాంగ్ కి స్టెప్స్ వేశారు. మరో ఐదుగురు మహిళా క్రికెటర్లు కూడా స్మృతీకి జతకలిశారు. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో స్మృతీ మంధానతో పాటు.. భారత మహిళ జట్టు క్రికెటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రాధా యాదవ్ కూడా ఉన్నారు. వీరంటు ఒకే రిథం తో ఎంజాయ్ చేస్తూ చేసిన డ్యాన్స్ వావ్ అనిపిస్తోంది.
Also Read: ఈ తరానికి తెలియని గోదావరిజిల్లాల సంప్రదాయ వంట.. లచ్చించారు. తయారీ ఎలా అంటే..