నేలకు తాకిన బంతి ఎంత బలంగా తిరిగి వస్తుందో.. అదే విధంగా తిరిగి వచ్చాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). గతేడాది గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఐపీఎల్(IPL 2022)లో పాల్గొన్నా చాలా తక్కువగా బౌలింగ్ చేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైనా రాణించలేకపోయాడు. దీంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు. కానీ ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్(GT)కు నాయకత్వం వహించి నాయకుడిగా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి జట్టుకు టైటిల్‌ను అందించాడు. హార్దిక్ టోర్నీ జరుగుతున్న సమయంలో ఎక్కడా ఎమోషన్‌ను బయట పెట్టలేదు. అతను ఎక్కువగా తనను తను నియంత్రించుకుంటాడు. మెక్‌య్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించినా హార్దిక్ జంప్ చేయడం కానీ, అరవడం కానీ చేయలేదు. కేవలం చిన్నగా నవ్వు నవ్వాడు అంతే.. జట్టు సభ్యులు ఒకరినొకరు అభినందించుకున్న తర్వాత డౌగౌట్‌కు వెళ్లి తర్వాత హార్దిక్ మొదటి చేసిన పని అతని భార్య నటాశను భావోద్వేగంతో కౌగిలించుకున్నాడు.
హార్దిక్ పాండ్యా భార్యను కౌగిలించుకున్న సమయంలో అతని కళ్లలో భావోద్వేగం స్పష్టంగా కనిపించింది. అతను తమ జట్టు మొదటి సీజన్‌లో కప్ అందించాడు. కానీ హార్దిక్ విజయం వెనక ఎన్నో కష్టాలు ఉన్నాయి. అతను టీమిండియాకు దూరమయ్యాడు. అతని బౌలింగ్ ఫిట్‌నెస్‌పై అనుమానాలు తలెత్తాయి. కానీ రెండు నెలలు తిరక్కకుండానే గుజరాత్ జట్టుకు కెప్టెన్ అయి టైటిల్ సాధించిపెట్టాడు. విజయంతో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. టోర్నమెంట్‌లో తను శాతంగా ఉండి, ఇలా రాణించడానికి తన భార్య, కొడుకే కారణమన్నాడు. హార్దిక్ ఫైనల్‌లో చక్కగా రాణించాడు. జోస్ బట్లర్, సంజు శాంసన్, హెట్మెయర్ వికెట్లు పడగొట్టి జట్టను 130 పరుగులకే కట్టడి చేశాడు. శుభ్‌మన్‌గ గిల్‌తో 64 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పాడు. హార్దిక్ 30 బంతుల్లో 34 పరుగులు చేసి 11 బాల్స్ మిగిలి ఉండగానే జట్టను గెలిపించాడు.
Hardik Pandya wife HUG & CRY.
Hardik’s wife Natasa Stankovic Gets Emotional.
Gujarat Titans win IPL 2022.#IPL2022 #GT #GTvsRR #HardikPandya #gujrattitans #Cricket #gujrattitans #Cricket #NarendraModiStadium— Vineet Sharma (@Vineetsharma906) May 30, 2022
మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి