Cricket: మైదానంలో గాయపడి మరణించిన అంతర్జాతీయ ఆటగాళ్లు.. లిస్టులో టీమిండియా ప్లేయర్‌ కూడా..

ఆడుతూనే మైదానంలో గాయపడి ప్రపంచానికి వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఈ ఘటనలు ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

Cricket: మైదానంలో గాయపడి మరణించిన అంతర్జాతీయ ఆటగాళ్లు.. లిస్టులో టీమిండియా ప్లేయర్‌ కూడా..
International Cricketers Died With Injuries (1)

Updated on: Nov 26, 2022 | 7:08 AM

క్రికెట్‌లో గెలుపు ఓటములు సహజమే. గెలిచిన జట్టుతోపాటు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తే.. ఓడిన జట్టుకు మాత్రం నిరాశను అందిస్తుంది. ఆ తర్వాత మరో మ్యాచ్‌పై పరస్పరం నిమగ్నమైపోతుంటారు. అలా కాకుండా ముఖ్యమైన టోర్నీల్లో నాకౌట్‌లో పరాజయం పాలైన జట్ల ఆటగాళ్లు కూడా చాలాసార్లు భావోద్వేగానికి లోనవుతుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చాలాసార్లు ఇలాగే జరిగింది.

ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు, ప్రేక్షకులు వినోదం గురించి ఆలోచిస్తుంటారు. కానీ, కొన్నిసార్లు మాత్రం అనుకోని ప్రమాదంతో అటు ఆటగాడి జీవితంలోనూ, అభిమానుల ఆనందంలోనూ ఎంతో మార్పు వస్తుంది. ఒక్కోసారి ఆ ప్లేయర్‌కు అదే చివరి మ్యాచ్, చివరి రోజు లేదా క్షణం అవ్వొచ్చు. ఆడుతూనే మైదానంలో గాయపడి ప్రపంచానికి వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. ఈ ఘటనలు ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్న మ్యాచ్‌ల నుంచి పెద్ద మ్యాచ్‌ల వరకు, ఆటగాడు బంతి తగిలి మరణించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. గాయం లేదా మరేదైనా కారణాలతో మరణించిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

వసీం రజా..

ఈ ఆటగాడు 1970, 80లలో పాకిస్థాన్ తరపున క్రికెట్ ఆడాడు. రజా 57 టెస్టు మ్యాచ్‌ల్లో 2800 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. సర్రే తరపున యాభై ఓవర్ల మ్యాచ్ ఆడుతున్న సమయంలో మైదానంలో గుండెపోటుకు గురయ్యాడు. ఆ తరువాత అతను మరణించాడు. అతని భార్య అన్నే కూడా గొప్ప క్రికెటర్. రజాకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

రామన్ లంబా..

ఈ భారత ఆటగాడు అతి చిన్న వయసులోనే కన్నుమూశాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో ఫార్వర్డ్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఢిల్లీకి చెందిన రమణ్ లాంబా తలకు బంతి తగిలింది. మూడు రోజుల పాటు కోమాలో ఉన్న అతను మరణించాడు. 1998లో అప్పటికి ఆయన వయసు 38 ఏళ్లు. లాంబా భారత్ తరపున 32 వన్డేలు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 8 వేలకు పైగా పరుగులు చేశాడు.

ఫిల్ హ్యూస్..

ఈ ఆస్ట్రేలియా ఆటగాడి అకాల మరణం క్రికెట్ ప్రపంచంతో పాటు ప్రపంచ క్రికెట్ ప్రేమికులను దిగ్భ్రాంతికి గురి చేసింది. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్‌లో న్యూ సౌత్ వేల్స్ తరపున ఆడుతున్నప్పుడు సీన్ అబాట్ బౌన్సర్ అతని తలకు తగిలింది. బంతిని తప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా అది అతని హెల్మెట్‌కు తగిలింది. హ్యూస్ రెండు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావం కారణంగా సిడ్నీ ఆసుపత్రిలో మరణించాడు. ఈ మరణంతో క్రికెట్ ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..