ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించి కప్ ఎగురేసుకుపోయింది. ఈ టోర్నీలో రాణించిన ఆసీస్ ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు వచ్చింది. అయితే దీనిపై విమర్శలు వచ్చాయి. అత్యధిక పరుగులు చేసిన బాబర్ ఆజంను కాదని వార్నర్‌కు ఎలా అవార్డు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. బాబర్ అజంకు కాకుండా డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ ద సిరీస్ అవార్డు ఇవ్వడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. బాబార్ ఆజం 6 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్‌ల్లో 289 పరుగులు చేశాడు.
ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా స్పందించాడు. ‘టోర్నీలో బాబర్ ఎక్కువ పరుగులు చేశాడు. అయితే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎంపిక కోసం అత్యధిక పరుగులనే కాకుండా ఇతర అంశాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. బ్యాటర్ చేసిన పరుగులు ప్రభావం జట్టు విజయావకాశాలపై ఎలా ఉన్నాయనే దానిని పరిశీలించింది. డేవిడ్ వార్నర్ చాలా కీలకమైన మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అందువల్లే ఆసీస్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది’’ అని వివరించాడు. టోర్నమెంట్‌లో బాబర్ అత్యధిక రన్ స్కోరర్‌గా ఉన్నప్పటికీ, విజేతను ఎంచుకోవడానికి ప్రమాణం ఎల్లప్పుడూ ఎవరు ఎక్కువ పరుగులు స్కోర్ చేశారనేది తప్పనిసరిగా ఉండదని అతను చెప్పాడు.
బాబర్ ఆజం వరుస మ్యాచ్‌ల్లో 68*, 9, 51, 70, 66, 39 పరుగులు చేశాడు. 126.25 స్ట్రైక్‌రేట్‌తో 303 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లలో బాబర్ అజామ్ వ్యక్తిగతంగా మూడో టాప్ స్కోరర్. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ 319 పరుగులు (2014), దిల్షాన్ 317 పరుగులు (2009) ఉన్నారు.
Read Also.. Rohith Sharma: ఈ విజయం అంత సులువుగా రాలేదు.. ఆటగాళ్లు అనుభవం నుంచి నేర్చుకుంటారు..