David Warner: తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధం విషయంలో కీలక ప్రకటన చేసిన అస్ట్రేలియన్ ఓపెనర్.. ఈ భావోద్వేగ పోస్ట్‌కు కారణం ఏమిటంటే..?

| Edited By: Rajeev Rayala

Dec 07, 2022 | 8:03 PM

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనపై విధించిన ‘కెప్టెన్సీ నిషేధం’ సమీక్ష కోసం చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నాడు. ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ధ్రువీకరించాడు. అదే క్రమంలో ‘‘నాకు క్రికెట్ కంటే నా కుటుంబమే చాలా ముఖ్యం’’ అని..

David Warner: తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధం విషయంలో కీలక ప్రకటన చేసిన అస్ట్రేలియన్ ఓపెనర్.. ఈ భావోద్వేగ పోస్ట్‌కు కారణం ఏమిటంటే..?
David Warner
Follow us on
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనపై విధించిన ‘కెప్టెన్సీ నిషేధం’ సమీక్ష కోసం చేసిన దరఖాస్తును ఉపసంహరించుకున్నాడు. ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అతను ధ్రువీకరించాడు. అదే క్రమంలో ‘‘నాకు క్రికెట్ కంటే నా కుటుంబమే చాలా ముఖ్యం’’ అని డేవిడ్ వార్నర్ ఖరాఖండిగా చెప్పాడు. ఇంకా తనపై ఉన్న నిషేధం విషయంలో తన తరఫున వాదించే లాయర్‌పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డాడు. అంతే కాక రివ్యూ ప్యానెల్ తనకు విరుద్ధంగా వ్యవహరించిందని వార్నర్ పేర్కొన్నాడు. ‘‘క్రికెట్ అనే డర్టీ లాండ్రీకి నా కుటుంబాన్ని వాషింగ్ మెషీన్‌లా ఉంచేందుకు నేను సిద్ధంగా లేను’’ అని వార్నర్ రివ్యూ ప్యానెల్‌ను ఉద్దేశించి తన తాజా ప్రకటనలో రాసుకొచ్చాడు. తనను, తన కుటుంబాన్ని మరింత అవమానానికి గురిచేస్తామని ప్యానెల్ బెదిరించిందని, తాను ఇకపై ప్రజలలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నానని వార్నర్ చెప్పుకొచ్చాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా వారి ప్రవర్తనా నియమావళిలో చేసిన మార్పుల తరువాత, వార్నర్ తనపై ఉన్న జీవితకాల కెప్టెన్సీ నిషేధాన్ని అప్పీల్ చేయడానికి అనుమతి పొందాడు. అయితే పరిస్థితులు తనకు సహకరించలేదు. వార్నర్‌పై ఉన్న నాయకత్వ నిషేధాన్ని ఎత్తివేయడం కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నప్పటికీ.. తనపై నిషేధం ఎప్పటికీ తొలగిపోదని అతను తన ప్రకటనలో తెలిపాడు.
వార్నర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ప్రకటన..

రివ్యూ ప్యానెల్‌కు తాను పంపిన ప్రతిపాదనను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా సమర్థించిందని వార్నర్ పేర్కొన్నాడు. తన కుటుంబం క్రికెట్‌లోని డర్టీ లాండ్రీకి వాషింగ్ మెషీన్‌గా ఉండాలని తాను కోరుకోవడం లేదని అన్నాడు. తన కుటుంబం, సహచరులు మళ్లీ అవమానాలను ఎదుర్కోవాలని తాను కోరుకోనని, అందుకే తన అప్లికేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నానని వార్నర్ తెలిపాడు.

కాగా, ప్రస్తుతం వార్నర్ అస్ట్రేలియా తరఫున వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతున్నాడు. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా సునాయాసంగా గెలుపొందింది. వార్నర్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..