20 జట్లు.. 5 వేదికలు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ఫైనల్.. టీ20 ప్రపంచకప్ 2026కి రంగం సిద్ధం..

2026 T20 World Cup: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం 2026లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభ, ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించనుంది.

20 జట్లు.. 5 వేదికలు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ఫైనల్.. టీ20 ప్రపంచకప్ 2026కి రంగం సిద్ధం..
T20 World Cup 2026

Updated on: Nov 09, 2025 | 7:34 PM

2026 T20 World Cup: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం వేదికలను దాదాపుగా ఖరారు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మెగా టోర్నమెంట్‌లోని కీలక మ్యాచ్‌లకు సంబంధించిన వేదికలపై ఒక స్పష్టత వచ్చింది.

ముఖ్య వేదికలు, మ్యాచ్‌లు:

ఫైనల్ మ్యాచ్: క్రికెట్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.

టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్ (ఓపెనర్) కూడా ఇదే స్టేడియంలో జరిగే అవకాశం ఉంది.

సెమీ-ఫైనల్: ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం ఒక సెమీ-ఫైనల్ మ్యాచ్‌కు వేదిక కానుంది.

శ్రీలంక జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటే, ఆ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించే అవకాశం ఉంది.

భారత్‌లోని ఇతర వేదికలు:

అహ్మదాబాద్, ముంబైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలను కూడా భారత్‌లో మ్యాచ్‌ల నిర్వహణకు షార్ట్‌లిస్ట్ చేశారు. ఒక్కో వేదికలో కనీసం 6 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

అయితే, తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్‌ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం) లేదా విశాఖపట్నం స్టేడియాలకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్ మ్యాచ్‌ల పరిస్థితి:

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా, పాకిస్థాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లను శ్రీలంక వేదికల్లోనే నిర్వహించాలని నిర్ణయించారు.

ఒకవేళ పాకిస్థాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటే, అప్పుడు తుదిపోరు అహ్మదాబాద్‌లో కాకుండా కొలంబో (శ్రీలంక)లో జరగనుంది.

టోర్నమెంట్ వివరాలు:

జట్లు: ఈసారి ప్రపంచ కప్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తం 20 జట్లు పాల్గొంటాయి.

ఫార్మాట్: ఈ 20 జట్లను ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీస్, ఫైనల్ జరుగుతాయి.

ఐసీసీ త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి, అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..