AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : లక్నోకు భారీ షాక్.. గాయంతో ఐపీఎల్ 2026 నుంచి శ్రీలంక స్టార్ అవుట్

IPL 2026 : లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, శ్రీలంక సంచలనం వనిందు హసరంగ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్నో టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఈ విషయాన్ని ధృవీకరించారు.

IPL 2026 : లక్నోకు భారీ షాక్.. గాయంతో ఐపీఎల్ 2026 నుంచి శ్రీలంక స్టార్ అవుట్
Wanindu Hasaranga
Rakesh
|

Updated on: Apr 10, 2026 | 8:41 AM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో అదరగొడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, శ్రీలంక సంచలనం వనిందు హసరంగ ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా ఆయన భారత్‌కు వచ్చే అవకాశం లేదని తేలిపోవడంతో, లక్నో యాజమాన్యం ప్రత్యామ్నాయ ఆటగాడి కోసం వేట మొదలుపెట్టింది. లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఎడమ కాలి కండరాల గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఫిబ్రవరిలో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో ఆయన గాయపడ్డారు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న హసరంగ, శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) నిర్వహించిన తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు కాలేదు. దీనివల్ల ఆయనకు ఐపీఎల్ ఆడేందుకు కావాల్సిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) లభించలేదు.

టామ్ మూడీ ఏమన్నారంటే?

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్నో టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ఈ విషయాన్ని ధృవీకరించారు. “హసరంగ మాతో చేరడం లేదనే వాస్తవాన్ని మేము అంగీకరిస్తున్నాము. ఆయన స్థానంలో మరో ఆటగాడిని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. రాబోయే 24 నుంచి 48 గంటల్లో కొత్త ప్లేయర్ పేరును ప్రకటిస్తాము” అని మూడీ స్పష్టం చేశారు. హసరంగను గత వేలంలో లక్నో రూ.2 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

రేసులో జార్జ్ లిండే

హసరంగ స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జార్జ్ లిండేను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని క్రికెట్ వర్గాల సమాచారం. లిండే ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ వివిధ లీగ్‌లలో తన స్పిన్ మ్యాజిక్‌తో ఆకట్టుకున్నాడు. హసరంగ లాంటి మ్యాచ్ విన్నర్ అందుబాటులో లేకపోవడం లక్నోకు లోటు అయినప్పటికీ, జార్జ్ లిండే ఆ స్థానాన్ని భర్తీ చేయగలడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.

ముకుల్ చౌదరి మ్యాజిక్

ఒకవైపు హసరంగ దూరమవ్వడం బాధాకరమైన విషయమే అయినా, మరోవైపు లక్నో యువ ఆటగాడు ముకుల్ చౌదరి సృష్టించిన సంచలన విజయం జట్టులో ఉత్సాహాన్ని నింపింది. కేకేఆర్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో ముకుల్ చౌదరి మరియు ఆవేశ్ ఖాన్ కలిసి 8వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (54 పరుగులు) నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో లక్నో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us