ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 టోర్నమెంట్ మినీ వేలం ప్రక్రియలో ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విదేశీ ఆటగాళ్లు రికార్డు మొత్తాలకు అమ్ముడు పోతున్నారు. ఈక్రమంలో ఐపీఎల్ మినీ వేలంలో జమ్మూ-కశ్మీర్ ఆల్ రౌండర్ వివ్రాంత్ శర్మ కూడా నక్క తోక తోక్కాడు. బేస్ ప్రైస్ రూ. 20 లక్షలు ఉన్న వివ్రాంట్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఏకంగా 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వివ్రాంత్ డిసెంబర్ 13, 2022న ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేసాడు. అంతకు ముందు లిస్ట్ ఏ క్రికెట్‌లో బంతి, బాల్‌తోనూ అద్భుతాలు సృష్టించాడు. తద్వారా ప్రతిష్ఠాత్మకమైన విజయ్ హజారే ట్రోఫీలో కశ్మీర్ జట్టు తొలిసారి నాకౌట్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఉత్తరాఖండ్‌పై అజేయంగా 154 పరుగులు చేశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్ లో 18 ఫోర్లు, 6 సిక్సర్లు ఉంటాయి. అతని క్రికెట్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. ఇది కాకుండా, అతను చాలా పొదుప బౌలింగ్ చేశాడు.ఇక 2022-23 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లో 128 పరుగులు చేశాడు వివ్రాంత్. అత్యధిక స్కోరు 63 . అలాగే ఆరు వికెట్లు కూడా తీశాడు.
కాగా మినీ వేలంలో ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేస్తోంది సన్ రైజర్స్ యజమాని కావ్యాపాప. ముఖ్యంగా యంగప్లేయర్లకే ప్రాముఖ్యతనిస్తోంది. అందులో భాగంగానే ఇంగ్లండ్ ఎమర్జింగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను 13.25 కోట్లకే కొనుగోలు చేసింది. ఆతర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉపేంద్ర యాదవ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ రూ. 25 లక్షలకు కొనుగోలు చేసింది. అలాగే పంజాబ్‌కు చెందిన మీడియం పేస్-ఆల్‌రౌండర్ సన్వీర్ సింగ్‌ను రూ. 20 లక్షల ప్రాథమిక ధరకు తీసుకుంది.
From a support bowler to a Riser, Vivrant is ready to travel from Jammu to Uppal. ?#BackToUppal #OrangeArmy #TATAIPLAuction pic.twitter.com/JsSkrOhien
— SunRisers Hyderabad (@SunRisers) December 23, 2022
ఐపీఎల్ లైవ్ యాక్షన్ లైవ్ ఇక్కడ వీక్షించండి