ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాస్వదేశానికి చేరుకుంది. జూన్ 29న T20 ప్రపంచకప్‌లో భారత్ చాంపియన్‌గా నిలవగా.. తుఫాను కారణంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. ప్రత్యేక విమానంలో గురువారం ఉదయం 6 గంటలకు ఇండియాకు చేరుకుంది. బార్బడోస్ నుంచి నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరిన టీమిండియా ప్లేయర్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రపంచకప్ విశేషాలను మోదీతో పంచుకున్నారు. టీమిండియాను అభినందించిన మోదీ.. వారితో అల్పాహారం తీసుకున్నారు.
విశ్వవిజేత గా నిలిచిన భారత్.. సగర్వంగా సొంతగడ్డ పై కాలుపెట్టింది. అటు ఢిల్లీ, ఇటు ముంబై లో కోట్లాది మంది ఘన స్వాగతం పలికారు. ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ముంబై లో ఓపెన్ టాప్ బస్ పై టీమ్ ఇండియా ప్లేయర్లు ర్యాలీగా వస్తుంటే.. ఒకవైపు సముద్రం, మరోవైపు జన సంద్రం చూసేందుకు రెండు కళ్ళు సరిపోలేదు. ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ర్యాలీని ఏర్పాటు చేశారు. రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. మెరైన్ డ్రైవ్ మీదుగా ర్యాలీ సాగింది. టీమిండియా అభిమానులతో మెరైన్ డ్రైవ్ నిండిపోయింది. ఒక పక్క సముద్రపు అలల శబ్దం.. మరోవైపు భారత్ మాతాకి జై నినాదాలతో ఆ ప్రాంతం అంతా హోరెత్తింది. ర్యాలీ అనంతరం వాంఖడే స్టేడియంలో టీమిండియా ప్లేయర్లకు సన్మాన కార్యక్రమం జరుగింది. అభిమానులకు ఉచితంగా వాంఖడే స్టేడియంలోకి ఎంట్రీ కల్పించింది ముంబై క్రికెట్ సంఘం.
ఇదే క్రమంలో ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది విస్తార ఎయిర్లైన్స్. ఢిల్లీ నుంచి ముంబైకి భారత ఆటగాళ్లు వచ్చే విమానానికి UK 1845 నెంబర్ ను కేటాయించింది. భారత స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, కెప్టెన్ రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 ను కలుపుతూ.. UK1845 గా కేటాయించింది. ఢిల్లీ నుంచి ముంబై వచ్చే ఆ ప్రయాణాన్ని కోహ్లీ, రోహిత్ శర్మ లకు అంకితం చేసి తన అభిమానాన్ని చాటుకుంది విస్తార ఎయిర్లైన్స్.
UK 1845 🏏🏆#Staytuned
— Vistara (@airvistara) July 4, 2024
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..