ఇక్కడ క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ అంటున్న.. ఇండియన్ మాజీ డాషింగ్ ఓపెనర్..

|

Jan 22, 2021 | 9:58 AM

ఆస్ట్రేలియా సరీస్ అనంతరం ఇండియాకు చేరుకున్న పేసర్ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది. దీనిపై స్పందించిన

ఇక్కడ క్రికెట్‌ అంటే ఆట మాత్రమే కాదు.. అంతకన్నా ఎక్కువ అంటున్న.. ఇండియన్ మాజీ డాషింగ్ ఓపెనర్..
Follow us on

ఆస్ట్రేలియా సరీస్ అనంతరం ఇండియాకు చేరుకున్న పేసర్ నటరాజన్‌కు సొంత ఊర్లో ఘన స్వాగతం లభించింది. దీనిపై స్పందించిన ఇండియన్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఇండియాలో క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు అంతకన్నా ఎక్కువ అన్నారు. నటరాజన్ తమిళనాడులోని సాలెం జిల్లా చిన్నప్పంపట్టి అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజలు అతడికి నీరాజనాలు పట్టారు. పూలమాలలు, డప్పువాయిధ్యాలతో స్వాగతం పలికారు. రథంపై ఊరేగిస్తూ సందడి చేశారు. నటరాజన్‌ అక్కడి వారికి అభివాదం చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా సెహ్వాగ్ నటరాజన్‌ ఊరేగింపు వీడియోను పోస్టు చేసి సంతోషం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అతడు చూపిన ప్రతిభను కొనియాడాడు. నటరాజన్‌ కు చిన్నప్పంపట్టి గ్రామంలో ఘన స్వాగతం లభించిందని అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌ బౌలర్‌గా ఎంపికైన నటరాజన్ ఒకేసారి మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. భారత్‌ తరఫున ఇలా ఒకేసారి అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు నటరాజన్. దీంతో అతడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

బనగానపల్లె నేతల మధ్య ముదురుతున్న మాటల తూటాలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. డిబెట్‌కి సిద్దమని ప్రకటన..