Virat Kohli Birthday: ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్.. భారీ షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకంటే?

|

Nov 05, 2023 | 10:34 AM

India vs South Africa, ICC World Cup: కోహ్లి పుట్టినరోజును పురస్కరించుకుని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు 70,000 కోహ్లి మాస్క్‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దానితో పాటు బాణసంచా ప్రదర్శన కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.

Virat Kohli Birthday: ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ బర్త్‌డే వేడుకలు క్యాన్సిల్.. భారీ షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకంటే?
Virat Kohli's Birthday At Eden Garden
Follow us on

India vs South Africa, ICC World Cup: విరాట్ కోహ్లీ ఈరోజు (నవంబర్ 5) తన 35వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోనున్నాడు. ఇది కాకుండా 2023 ప్రపంచకప్‌లో ఎనిమిదో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈ హై ఓల్టేజీ మ్యాచ్‌ జరగనుంది. కోహ్లి బ్యాట్‌తో 49వ సెంచరీ సాధించేందుకు సిద్ధంగా ఉంద. అయితే, ఈలోగా కోహ్లి స్పెషల్ డేని మరింత స్పెషల్ గా మార్చబోతున్న బెంగాల్ క్రికెట్ కు ఎదురుదెబ్బ తగిలింది.

కోహ్లి పుట్టినరోజును పురస్కరించుకుని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్లన్నీ క్యాన్సిల్ అయ్యాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చిన అభిమానులకు 70,000 కోహ్లి మాస్క్‌లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దానితో పాటు బాణసంచా ప్రదర్శన కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అలాగే కేక్ కూడా కట్ చేసేందుకు ప్లాన్ చేసింది. అయితే ఈ కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి.

ఇవి కూడా చదవండి

వార్తల ప్రకారం, ఈ ప్రోగ్రాం ICC నిబంధనలకు విరుద్ధం. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం కార్యక్రమాన్ని రద్దు చేసింది. అయితే, అభిమానులు కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు మాత్రం చెప్పనున్నారు. కేక్ కటింగ్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ లోపల మాత్రమే జరుగుతుంది.

ఫామ్‌లో ఉన్న విరాట్ ప్రస్తుతం 442 పరుగులతో 2023 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆఫ్రికా జట్టుకు చెందిన క్వింటన్ డి కాక్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఏడు మ్యాచ్‌లు ఆడిన అతను 545 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ మధ్య పోటీ ఉంటుంది. టోర్నీలో కోహ్లి సెంచరీతో సహా 88.40 సగటుతో దూసుకపోతున్నాడు.

జీవితంలో తొలిదశలో ఎన్నో అపజయాలు చవిచూసి నేడు ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు విరాట్ బ్యాట్ తో సెంచరీ సాధిస్తే అది సచిన్ 49 సెంచరీల రికార్డుతో సమానం కానుంది.

రెండు జట్లు..

టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్. , ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసీద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిక్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లుంగీ న్గిడి, మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కాగిజార్డ్ రజాబాడా, విలియమ్స్ హెండ్రిక్స్, ఆండిలే ఫెహ్లుక్వాయో, తబ్రిజ్ షమ్సీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..