IND vs AUS Test Series: కింగ్‌ కోహ్లీకి ‘నాథన్‌’ కష్టాలు.. ముఖాముఖి పోరులో ఆధిపత్యం ఎవరిదంటే?

|

Feb 07, 2023 | 7:15 AM

Border-Gavaskar Trophy: ఫిబ్రవరి 9 నుంచి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ, స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌ల పోరుపైనే అందరి చూపు నెలకొంది.

IND vs AUS Test Series: కింగ్‌ కోహ్లీకి నాథన్‌ కష్టాలు.. ముఖాముఖి పోరులో ఆధిపత్యం ఎవరిదంటే?
Ind Vs Aus Kohli Vs Lyon
Follow us on

IND vs AUS Test, Virat Kohli vs Nathan Lyon: 2023లో మొదటి టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు సర్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ సిరీస్‌ని టీమిండియా సొంతగడ్డపై ఆడనుంది. ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తొలిసారిగా రోహిత్ శర్మ భారత జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. భారత్‌లో జరిగే ఈ సిరీస్‌లో స్పిన్ బౌలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ భారత జట్టుకు చుక్కలు చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీకి నాథన్ లియాన్ చెమటలు పట్టించే ఛాన్స్ ఉంది.

లయన్‌పై కోహ్లీ రికార్డులు?

టెస్ట్ క్రికెట్‌లో, నాథన్ లియాన్ ఇప్పటివరకు విరాట్ కోహ్లీకి మొత్తం 782 బంతులు వేశాడు. ఇందులో కోహ్లీ 58.6 సగటుతో, 52.4 స్ట్రైక్ రేట్‌తో 410 పరుగులు చేశాడు. ఈ సమయంలో లయన్ కోహ్లీకి మొత్తం 514 డాట్ బాల్స్ విసిరాడు. ప్రస్తుత భారత ఆటగాళ్లలో లయన్స్‌పై కోహ్లీకి అత్యుత్తమ సగటు ఉంది.

కోహ్లి ఎన్ని బౌండరీలు కొట్టాడు?

టెస్టు క్రికెట్‌లో ఆడుతున్నప్పుడు కోహ్లీ నాథన్ లియాన్‌ బౌలింగ్‌లో మొత్తం 36 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.

ఇవి కూడా చదవండి

కోహ్లిని ఎన్నిసార్లు అవుట్ చేశాడు?

టెస్టుల్లో ఇప్పటి వరకు నాథన్ లియాన్ 7 సార్లు విరాట్ కోహ్లీకి పెవిలియన్ బాట పట్టాడు. ఇందులో లయన్ 2013లో మూడుసార్లు, 2014లో ఒకసారి, 2017లో ఒకసారి, 2018లో రెండుసార్లు కోహ్లీని అవుట్ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరి మధ్య ఈసారి రసవత్తమైన పోరు జరగనుంది.

బోర్డర్-గవాస్కర్ సిరీస్ షెడ్యూల్..

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 13 వరకు మొదటి టెస్ట్ మ్యాచ్.

ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టెస్టు మ్యాచ్.

మార్చి 1 నుంచి మార్చి 5 వరకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 9 నుంచి మార్చి 13 వరకు నాలుగో టెస్టు మ్యాచ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..