Kohli vs Ganguly: మరింత ముదురుతోందా.. ఏమాత్రం తగ్గేదేలే అంటోన్న కోహ్లీ.. సోషల్ మీడియాలో గంగూలీకి భారీ షాక్

|

Apr 17, 2023 | 5:03 PM

IPL 2023: ఇద్దరు భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదాలకు తెర పడడం లేదు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన IPL 2023 మ్యాచ్‌తో మరోసారి తెరపైకి వచ్చారు. గంగూలీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చోటుచేసుకుంది.

Kohli vs Ganguly: మరింత ముదురుతోందా.. ఏమాత్రం తగ్గేదేలే అంటోన్న కోహ్లీ.. సోషల్ మీడియాలో గంగూలీకి భారీ షాక్
Kohli Vs Ganguly
Follow us on

ఇద్దరు భారత మాజీ కెప్టెన్లు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదాలకు తెర పడడం లేదు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన IPL 2023 మ్యాచ్‌తో మరోసారి తెరపైకి వచ్చారు. గంగూలీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చోటుచేసుకుంది. ఇదంతా చల్లారకముందే.. మరోసారి సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ చేసిన పనితో వీరిద్దరి మధ్య వివాదం నిజమేనని తెలుస్తోంది. కింగ్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో సౌరవ్ గంగూలీని అన్‌ఫాలో చేసినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు కోహ్లీకి అండగా కామెంట్లు చేస్తున్నారు. RCB vs DC మ్యాచ్ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీని అనుసరించేవాడు. అయితే, ఆ మ్యాచ్‌లో చోటుచేసుకున్న పరిస్థితితో అన్‌ఫాలో చేశాడంట.

RCB vs DC మ్యాచ్‌లో ఏం జరిగింది?

మ్యాచ్ 18వ ఓవర్‌లో ఆర్‌సీబీకి వికెట్ అవసరమైన సమయంలో, ఢిల్లీ డగ్ అవుట్ సమీపంలో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి అద్భుత క్యాచ్ పట్లాడు. ఈ క్యాచ్‌ను పట్టుకున్న తర్వాత, డీసీ డగ్ అవుట్‌లో కూర్చున్న సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్‌లవైపు కోహ్లీ ఘాటుగా చూశాడు. అదే సమయంలో మ్యాచ్ పూర్తయ్యాక కోహ్లి, గంగూలీ కరచాలనం కూడా చేసుకోలేదు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండేవాడు. 2021లో దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీని వదులుకోవాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీని కూడా బీసీసీఐ అతడి నుంచి తప్పించింది.

ఇవి కూడా చదవండి

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీ మాట్లాడుతూ, ప్రకటనకు కొన్ని గంటల ముందు మాత్రమే దాని గురించి తనకు తెలిసిందని, గంగూలీ ప్రకటన విరుద్ధంగా ఉందంటూ తెలిపాడు. దీంతో వివాదం రాజుకుంది.

వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించబడిన తర్వాత, దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌లో 1-2 తేడాతో ఓడిపోవడంతో కోహ్లీ టెస్టు జట్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. ఆ తర్వాత, రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో టీమిండియాను నడిపిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..