Virat Kohli : కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ టోర్నీలో తదుపరి మ్యాచ్‌కు విరాట్ దూరం

Virat Kohli : టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చిన్న నిరాశ ఎదురైంది. విజయ్ హజారే ట్రోఫీలో వరుస ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్న కోహ్లీ, తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నారు.

Virat Kohli : కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ టోర్నీలో తదుపరి మ్యాచ్‌కు విరాట్ దూరం
Virat Kohli Century

Updated on: Jan 05, 2026 | 6:13 PM

Virat Kohli : టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను చూడాలని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక చిన్న నిరాశ ఎదురైంది. విజయ్ హజారే ట్రోఫీలో వరుస ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్న కోహ్లీ, తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నారు. కొత్త ఏడాదిలో కోహ్లీ నేరుగా న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లోనే మైదానంలోకి దిగే అవకాశం ఉంది. ఈ లోపు దేశవాళీ క్రికెట్‌లో ఆయన మరో మ్యాచ్ ఆడతారని ఆశించిన ఫ్యాన్స్‌కు తాజా వార్తలు నిరుత్సాహాన్ని కలిగిస్తున్నాయి.

మంగళవారం (జనవరి 6, 2026) రైల్వేస్ జట్టుతో ఢిల్లీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడతారని మొదట వార్తలు వచ్చాయి. స్వయంగా డిడిసిఎ అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం కోహ్లీ ఈ మ్యాచ్ ఆడటం లేదు. గత రెండు మ్యాచ్‌ల్లో ఆంధ్రపై సెంచరీ (100+), గుజరాత్‌పై 77 పరుగులు చేసిన విరాట్, అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ టీమ్ క్యాంప్‌ను వీడి ముంబైలోని తన ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వన్డే సిరీస్ ముందు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఒకవైపు కోహ్లీ అందుబాటులో లేకపోయినా, రేపు జరగనున్న ఇతర విజయ్ హజారే మ్యాచ్‌లలో టీమిండియా స్టార్లు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ యాక్షన్‌లోకి దిగుతున్నారు. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన పంజాబ్ స్టార్ గిల్, గోవాతో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నారు. మరోవైపు, మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత వెన్ను గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ముంబై జట్టు పగ్గాలను చేపట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే ఈ మ్యాచ్ అయ్యర్‌కు చాలా కీలకం. ఇందులో అతను ఫిట్‌గా ఉన్నట్లు నిరూపించుకుంటేనే న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడేందుకు లైన్ క్లియర్ అవుతుంది.

విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో కేవలం తన ఫామ్ పదును చూసుకోవడానికి మాత్రమే ఆడారు. సుమారు 15 ఏళ్ల తర్వాత దేశవాళీ వన్డే టోర్నీలో ఆడిన ఆయన, తానెందుకు కింగ్ అనిపించుకుంటారో బ్యాట్‌తో నిరూపించారు. ఇప్పుడు ఆయన పూర్తి ఫోకస్ న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌పైనే ఉంది. ఈ సిరీస్ ద్వారా 2027 వరల్డ్ కప్ సన్నాహకాలను కోహ్లీ ఘనంగా ప్రారంభించాలని భావిస్తున్నారు. అప్పటివరకు కోహ్లీ మైదానంలో కనిపించకపోయినా, నెట్స్‌లో మాత్రం కఠినంగా శ్రమిస్తూనే ఉంటారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..