Virat Kohli : ధోని ఇలాకాలో కోహ్లీ ధమాకా..రాంచీలో కింగ్ రికార్డుల సునామీ!

రాంచీ... ఇది టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని సొంత నగరం. ఈ నగరం పేరు చెప్పగానే అభిమానులకు ముందుగా ధోని గుర్తుకొస్తాడు. అయితే సౌతాఫ్రికాతో ఇక్కడ జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో, ధోని ప్రాంతంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో అద్భుతమైన ధమాకా సృష్టించాడు.

Virat Kohli : ధోని ఇలాకాలో కోహ్లీ ధమాకా..రాంచీలో కింగ్  రికార్డుల సునామీ!
Virat Kohli

Updated on: Nov 30, 2025 | 6:22 PM

Virat Kohli : రాంచీ… ఇది టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోని సొంత నగరం. ఈ నగరం పేరు చెప్పగానే అభిమానులకు ముందుగా ధోని గుర్తుకొస్తాడు. అయితే సౌతాఫ్రికాతో ఇక్కడ జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో, ధోని ప్రాంతంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో అద్భుతమైన ధమాకా సృష్టించాడు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు కోహ్లీ, తన ఆప్తమిత్రుడు ధోని ఇంటికి వెళ్లి కలిశారు. వారిద్దరి చర్చలు రహస్యమైనప్పటికీ, ఆ మీటింగ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహం రెండు రోజుల తర్వాత కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రూపంలో బయటకు వచ్చింది. ధోని సిటీలో కోహ్లీ సెంచరీ సాధించి, ఏకంగా పలు రికార్డులను బద్దలు కొట్టడం విశేషం.

రాంచీలోని JSCA స్టేడియంలో ఆదివారం (నవంబర్ 30) జరిగిన ఈ వన్డే సిరీస్ మొదటి మ్యాచ్‌లో, కోహ్లీ 38వ ఓవర్‌లో 102 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ సెంచరీ కేవలం పరుగుల లెక్క మాత్రమే కాదు, అది పలు రికార్డుల సమాహారం.

52వ వన్డే సెంచరీ: ఇది విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ. దీని ద్వారా ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (టెస్ట్‌లో 51 సెంచరీలు) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు.

రాంచీలో 3 సెంచరీలు: రాంచీ స్టేడియంలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ. ఈ మైదానంలో ఆడిన 5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో కోహ్లీ ఏకంగా 173 సగటు, 110 స్ట్రైక్ రేట్‌తో 519 పరుగులు చేశాడు.

మూడు వేదికల్లో 3 సెంచరీలు: భారత్‌లో మూడు వేర్వేరు వేదికలలో (విశాఖపట్నం, పూణే, రాంచీ) 3 సెంచరీలు సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్ కేవలం వడోదరలో మాత్రమే ఈ ఫీట్‌ను సాధించాడు.

సౌతాఫ్రికా పై రికార్డు: సౌతాఫ్రికా పై అత్యధిక సెంచరీలు (6) చేసిన భారతీయ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. దీని ద్వారా డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్ (5 సెంచరీలు) రికార్డును కోహ్లీ అధిగమించాడు.

చరిత్రలో 7000వ సెంచరీ: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో నమోదైన 7000వ సెంచరీ ఇదే కావడం మరో విశేషం.

స్వదేశంలో 50+ స్కోర్లు: భారత గడ్డపై వన్డేల్లో 59వ సారి 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసి, స్వదేశంలో అత్యధిక 50+ స్కోర్ల రికార్డును కోహ్లీ సచిన్ టెండూల్కర్ (58) నుంచి సొంతం చేసుకున్నాడు.

నెం.1 భాగస్వామ్యం: ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి సాధించిన సెంచరీ భాగస్వామ్యం, వన్డే క్రికెట్‌లో కోహ్లీ-రోహిత్ జోడీ సగటును 58 కంటే ఎక్కువకు పెంచింది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే పార్టనర్ షిప్ యావరేజ్.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..