IPL 2022: విరాట్ కోహ్లీ వేలంలోకి వస్తే అతడిని దక్కించుకోవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి.. ఒకవేళ కోహ్లీ నిజంగానే వేలంలోకి రావాలనుకున్నా ఆర్సీబీ అతడిని రిలీజ్ చేస్తుందా అనేది ప్రశ్న..? కానీ ఇది కుదరదు ఎందుకంటే ఇది ఫెవికాల్ బంధమని విరాట్ కోహ్లీ స్వయంగా వెల్లడించాడు. ఇతర ఫ్రాంచైజీలు వేలంలో హాజరుకావలని కోరినప్పుడు కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం ఆగిపోవడంతో జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన విరాట్ కోహ్లీని చాలా ఫ్రాంచైజీలు సంప్రదించాయి. వేలంలోకి రావాలని కోరాయి. కానీ కోహ్లీ తిరస్కరించాడు. 8 ఏళ్ల పాటు RCBకి కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి తన పోడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించాడు.
33 ఏళ్ల విరాట్ కోహ్లి RCB కోసం అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఈ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను ఎప్పుడూ గెలవలేకపోయింది. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఆర్‌సీబీ నా జీవితంలో ఒక భాగం. నాకు చాలా ప్రత్యేకమైనది. చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఎవ్వరినీ నమ్మలేను’ అన్నాడు. అంతకుముందు ఐపీఎల్‌లో ఆడిన ఓ మ్యాచ్ గురించి కోహ్లీ ప్రస్తావించాడు. అందులో తాను ఇప్పటికి ఆ ఓటమిని మర్చిపోలేనని చెప్పాడు. ఆ మ్యాచ్ IPL 2016లో ఫైనల్. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.
What is @imVKohli’s first memory of joining RCB? What was that funny incident that happened to him in year 1 of the IPL as a 19-year old?
Find out here on the #RCBPodcast powered by @KotakBankLtd!#PlayBold #WeAreChallengers pic.twitter.com/x3Qb0RlxEM
— Royal Challengers Bangalore (@RCBTweets) February 6, 2022