Asia Cup 2023: పాక్‌ స్పీడ్‌స్టర్‌ పని పట్టేందుకు కోసం రోహిత్, కోహ్లీ ప్లాన్స్.. ప్రాక్టీసులో ఏం చేశారో తెలుసా?

|

Aug 27, 2023 | 7:59 PM

ప్రధాన టోర్నీల్లో ఎడమచేతి వాటం బౌలర్లు టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మహ్మద్ అమీర్, 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ట్రెంట్ బౌల్ట్, 2021 టీ20 ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిదీ టీమిండియాకు చుక్కలు చూపించారు.. ఈ మూడు టోర్నీల్లోనూ భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే ఔటయ్యారు. మరీ ముఖ్యంగా 2021 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహీన్ టీమిండియా టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు

Asia Cup 2023: పాక్‌ స్పీడ్‌స్టర్‌ పని పట్టేందుకు కోసం రోహిత్, కోహ్లీ ప్లాన్స్.. ప్రాక్టీసులో ఏం చేశారో తెలుసా?
India Vs Pakistan
Follow us on

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి మెగా క్రికెట్‌టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 2న టీమిండియా తన తొలి మ్యాచ్ ను పాకిస్థాన్ తో ఆడనుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. బెంగళూరులోని ఆలూరులోని కేఎస్‌సీఏ స్టేడియంలో భారత జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా, లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కొనేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రధాన టోర్నీల్లో ఎడమచేతి వాటం బౌలర్లు టీమిండియాకు కొరకరాని కొయ్యగా మారారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మహ్మద్ అమీర్, 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ట్రెంట్ బౌల్ట్, 2021 టీ20 ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిదీ టీమిండియాకు చుక్కలు చూపించారు.. ఈ మూడు టోర్నీల్లోనూ భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే ఔటయ్యారు. మరీ ముఖ్యంగా 2021 టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ స్పీడ్‌స్టర్‌ షాహీన్ టీమిండియా టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. మొదట రోహిత్, ఆతర్వాత కేఎల్‌ రాహుల్‌, ఆఖర్లో విరాట్‌ కోహ్లీల వికెట్లను తీసి పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాఉడ.

ఈక్రమంలో ప్రస్తుతం ఆసియా కప్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న టీమ్ ఇండియా బ్యాటర్లు షాహీన్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకోసం పొడవాటి ఎడమచేతి వాటం బౌలర్ అనికేత్ చౌదరిని పిలిచారు. షాహీన్ అఫ్రిది తరహాలో బౌలింగ్ చేసే 33 ఏళ్ల అనికేత్ ప్రస్తుతం టీమ్ ఇండియాకు నెట్ బౌలర్‌గా పనిచేస్తున్నాడు. అలాగే మూడో రోజు ప్రాక్టీస్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అనికేత్ బంతులకు ప్రాక్టీస్‌ చేశారు. తద్వారా షాహీన్ అఫ్రిది ఇన్‌స్వింగ్ అండ్‌ యార్కర్‌ డెలివరీలను ఎదుర్కోవడానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ ఏడాది ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. సెప్టెంబరు 2న పాకిస్థాన్‌ మ్యాచ్‌తో టీమిండియా ఆసియా కప్ పోరాటాన్ని ప్రారంభించనుంది.

ఇవి కూడా చదవండి

మరో మూడు రోజల్లో మెగా క్రికెట్ టోర్నీ..

టీమిండియా ప్రాక్టీస్ సెషన్ వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..