విరాట్ కోహ్లీ(Virat kohli) అన్ని ఫార్మాట్లలో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడని, అతను కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma)కు సహాయపడతాడని టీమిండియా మాజీ బౌలర్ అగార్కర్(agarkar) చెప్పాడు. విరాట్ కోహ్లీ నవంబర్ 2019 నుంచి అంతర్జాతీయ సెంచరీ కొట్టలేదు. గత ఏడాది 19 ఇన్నింగ్స్‌లలో కేవలం 536 పరుగులు చేసిన స్టార్ బ్యాటర్ సగటు 28.21. అయితే, దక్షిణాఫ్రికాలో ఇటీవల ముగిసిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ 2 అర్ధసెంచరీలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చే సంకేతాలను ప్రదర్శించాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని విడిచిపెట్టిన కోహ్లీ తన బ్యాట్ రాణిస్తే జట్టుకు మంచిదని అగార్కర్ పేర్కొన్నాడు.
“విరాట్ కోహ్లీ ఎలాంటి ఆటగాడో అందరికి తెలుసు. కానీ ప్రస్తుతానికి అతను అత్యుత్తమంగా లేడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తే రోహిత్ శర్మ పని సులభం అవుతుంది.” అని చెప్పాడు. ఫిబ్రవరిలో 3 మ్యాచ్‌ల ODI, T20I సిరీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. కోహ్లీని రెండు స్క్వాడ్‌లలో ఎంపిక చేశారు. మరోవైపు గాయం కోలుకున్న రోహిత్ శర్మ భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు.
Read Also… T20I Cricket: టీ20ఐ హ్యాట్రిక్ లిస్టులో 26 మంది బౌలర్లు.. ఈ నలుగురు మాత్రం చాలా స్పెషల్.. ఎందుకంటే?