Video: 3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ.. మైదానంలో ఏం చేశాడంటే?

Virat Kohli Video: రాజ్‌కోట్ వన్డేలో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ అయిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్‌ను తలపించేలా కోహ్లీ అవుట్ కావడం చూసి అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.

Video: 3 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. షాకైన కింగ్ కోహ్లీ.. మైదానంలో ఏం చేశాడంటే?
Ind Vs Nz 2nd Odi Virat Kohli

Updated on: Jan 14, 2026 | 4:48 PM

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానం 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ జ్ఞాపకాలను నెమరువేసింది. ఆ రోజు అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో కోహ్లీ ఎలాగైతే ప్లేయిడ్ ఆన్ (Inside Edge) అయి అవుట్ అయ్యాడో, సరిగ్గా అలాగే నేడు కివీస్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

అసలేం జరిగింది?

భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో క్రిస్టియన్ క్లార్క్ వేసిన ఒక లెంగ్త్ బంతిని కోహ్లీ థర్డ్ మ్యాన్ దిశగా మళ్లించే ప్రయత్నం చేశాడు. అయితే బంతి కోహ్లీ బ్యాట్ లోపలి అంచును తాకి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది. బంతి స్టంప్స్‌ను తాకిన వెంటనే కోహ్లీ నమ్మలేనట్లుగా అలాగే నిలబడిపోయాడు. దాదాపు నిమిషం పాటు పిచ్‌ను, ఫీల్డర్లను షాక్‌తో చూస్తూ ఉండిపోయిన కోహ్లీ, ఆ తర్వాత భారంగా పెవిలియన్ వైపు అడుగులు వేశారు.

వైరల్ అవుతున్న ఫోటోలు – ఫ్యాన్స్ ఆవేదన:

2023 నవంబర్ 19న ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో కూడా కోహ్లీ సరిగ్గా 54 పరుగుల వద్ద ఇలాగే అవుట్ అయ్యాడు. ఆ రోజు స్టేడియం మొత్తం ఎలాగైతే నిశ్శబ్దమైపోయిందో, రాజ్‌కోట్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ రెండు అవుట్‌లకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. “చరిత్ర పునరావృతమైంది”, “ఆ గాయం మళ్ళీ గుర్తొచ్చింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కోహ్లీ స్కోరు, మ్యాచ్ పరిస్థితి:

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో 23 పరుగులు (32 బంతుల్లో) చేసి అవుట్ అయ్యాడు. అలాగే భారత్ స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వికెట్లను కూడా కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆ తర్వాత నితీష్ రెడ్డితో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..