IND vs ENG: విరాట్ కోహ్లీ హఠాత్తుగా క్రికెట్‌కు ఎందుకు దూరమయ్యాడు.. అసలు కారణం ఇదేనా?

|

Feb 11, 2024 | 11:24 AM

Virat Kohli Absence: విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి కోహ్లి వైదొలగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. కోహ్లి అందుబాటులో లేకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా.. నిజం మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు.

IND vs ENG: విరాట్ కోహ్లీ హఠాత్తుగా క్రికెట్‌కు ఎందుకు దూరమయ్యాడు.. అసలు కారణం ఇదేనా?
Virat Kohli Come Back
Follow us on

Virat Kohli Absence: ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు శనివారం భారత జట్టును ప్రకటించింది. ఇందులో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి పేరు కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి కోహ్లీ తన పేరును ఉపసంహరించుకున్నాడు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉన్నాడు. మొత్తం 5 మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి కోహ్లీ వైదొలగడంతో ఒక్కసారిగా ఏం జరిగిందోనని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ మార్చి 11 వరకు జరగనుంది. అప్పటి వరకు అతను ఎలాంటి మ్యాచ్‌లు ఆడడం లేదు.

జనవరి 22 న, విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్టుల నుంచి తన పేరును ఉపసంహరించుకోవడం గురించి బోర్డు, కెప్టెన్, కోచ్‌తో మాట్లాడాడు. కొన్ని కారణాల వల్ల కోహ్లి తన కుటుంబంతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో అతడు రెండు టెస్టుల్లో ఆడడని బీసీసీఐ తొలుత చెప్పుకొచ్చింది.

కోహ్లి అందుబాటులో లేకపోవడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నా.. నిజం మాత్రం బయటకు రాలేదు. దీనిపై కోహ్లి కానీ, అతని భార్య అనుష్క కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కోహ్లి తల్లి అనారోగ్యంతో ఉందని పుకార్లు వచ్చాయి. అయితే,. విరాట్ అన్నయ్య వికాస్ కోహ్లీ దానిని ఖండించాడు.

ఇదిలా ఉంటే విరాట్ రెండోసారి తండ్రి కానున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. డివిలియర్స్ కూడా ఈ ప్రకటన చేశాడు. అయితే, అది అబద్ధమని ఆ తర్వాత ఏబీడీ స్వయంగా క్షమాపణలు తెలిపాడు. విరాట్ స్వయంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నాడా అనే ప్రశ్న కూడా తలెత్తింది. వీటన్నింటికీ కోహ్లీ స్వయంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 15 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. తర్వాత ఫిబ్రవరి 23 నుంచి 27 వరకు రాంచీలో నాలుగో టెస్టు నిర్వహించనున్నారు. చివరి టెస్టు మార్చి 7 నుంచి 11 వరకు ధర్మశాలలో జరగనుంది.

చివరి మూడు టెస్టులకు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..