టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో రికార్డ్ చేరింది. కెరీర్‌లో అటు బ్యాట్స్‌మెన్‌గా.. ఇటు కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా సౌతాంఫ్టన్ లో ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 48 బంతుల్లో అర్థశతకం సాధించాడు. అయితే లీగ్ దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 82, పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 77 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో అర్థ శతకం సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. 1992లో జరిగిన ప్రపంచకప్‌లో అప్పటి కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ ఘనత సాధించారు.
82 ⇨ 77 ⇨ 50*
Third consecutive #CWC19 half-century for #ViratKohli
It's his 93rd 50-plus score in ODI cricket!#INDvAFG | #TeamIndia pic.twitter.com/rM0T7KaRzn
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019