Asia Cup 2022: ప్రస్తుతం భారత క్రికెట్‌లో అతిపెద్ద ప్రశ్న విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించే . విరాట్ ఎప్పుడు ఫామ్‌లోకి వస్తాడో.. మునపటిలా మళ్లీ సెంచరీలు కొట్టెదెప్పుడోనని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు వెస్టిండీస్ పర్యటనతో పాటు జింబాబ్వే టూర్‌కు కోహ్లీని ఎంపికచేయకపోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. త్వరలో ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌తో పాటు ఆసియా కప్‌లు రానున్నాయి. ఈక్రమంలో జట్టులో కోహ్లీ ఉంటాడా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మీడియా కథనాల ప్రకారం ఆసియాకప్ కోసం విరాట్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే తన ప్రణాళికలను భారత సెలెక్టర్లకు కూడా చెప్పాడట.
కాగా ఆసియా కప్‌కు ముందు టీమిండియా జింబాబ్వేలో పర్యటించాల్సి ఉంది. ఇందు కోసం జూలై 30న జట్టును ఎంపిక చేశారు. కాగా ఈ టూర్‌లో విరాట్ కూడా భాగమవుతాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే15 మంది సభ్యుల టీమ్‌లో అతని పేరు లేదు. దీంతో విరాట్ ఎప్పుడు మళ్లీ జట్టులో చేరుతాడో అన్న అనుమానాలు పెరిగాయి. అయితే విరాట్ కోహ్లీ తన ప్రణాళికను భారత సెలెక్టర్లతో స్పష్టంగా చర్చించినట్లు పీటీఐ పేర్కొంది. కాగా జింబాబ్వే పర్యటనలో టీమిండియాకు శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. ఆగస్టు 18 నుంచి ఆగస్టు 22 వరకు జింబాబ్వేలో భారత్ పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో మొత్తం 3 వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు హరారేలోనే జరుగుతాయి. కాగా ఈ టూర్‌లో దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్ పునరాగమనం చేయనున్నారు. కాగా గాయంతో ఇబ్బంది పడుతోన్న KL రాహుల్ కూడా ఆసియా కప్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..