Virat Kohli Injured: హర్షల్ పటేల్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ గాయం.. నెట్ ప్రాక్టీస్ వీడియోను ఇక్కడ చూడండి..

|

Nov 09, 2022 | 12:48 PM

నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. విరాట్ కోహ్లి గాయం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం.

Virat Kohli Injured: హర్షల్ పటేల్ వేసిన బంతికి విరాట్ కోహ్లీ గాయం.. నెట్ ప్రాక్టీస్ వీడియోను ఇక్కడ చూడండి..
Virat Kohli Injured
Follow us on

ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు.. టీమిండియా అభిమానులకు చాలా బ్యాడ్ న్యూస్. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా హర్షల్ పటేల్ వేసిన బంతి విరాట్ కోహ్లీ గజ్జల్లో తగిలింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం..  విరాట్ కోహ్లీ తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. అతను నెట్ ప్రాక్టీస్‌ను మధ్యలోనే వదిలి మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ గాయం ఏర్పడింది. హర్షల్ పటేల్ వేసిన ఫాస్ట్ బాల్ విరాట్ కోహ్లీని దెబ్బతీసింది. గాయం తర్వాత విరాట్ కోహ్లి వెంటనే మైదానం వీడాడు. విరాట్ కోహ్లీకి సంబంధించిన అప్‌డేట్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

విరాట్ కోహ్లీ గాయం టీంమిడియాకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోవడం విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కూడా ఉంది. ఈ మెగా ఈవెంట్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ ఈ ICC T20 ప్రపంచ కప్ 2022లో అత్యధిక పరుగులు మాత్రమే సాధించాడు. అతను ఇప్పుడు ఈ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకున్నాడు.

అంతకుముందు మంగళవారం, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా నెట్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన సంగతి తెలిసిందే. అడిలైడ్‌లోని నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో రోహిత్ శర్మ కుడి చేతికి గాయమైంది. దీంతో క్రీజును వదిలి పక్కకు వెళ్లిపోయాడు. గాయంతో కొద్ది సేపు విలవిల్లాడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఫిజియో ఇతర సిబ్బంది పరుగు పరుగును వచ్చి రోహిత్‌ గాయాన్ని పరిశీలించారు. తీవ్రతను అంచనా వేసి చికిత్స అందించారు.  ఆ తర్వాత  కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న హిట్‌మ్యాన్‌ మళ్లీ బ్యాట్‌ పట్టాడు. కాగా రోహిత్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం చూసి భారత జట్టుతో పాటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.  ఇంగ్లిష్‌ టీంతో సెమీస్‌ కోసం అడిలైడ్‌లో ఆప్షనల్‌ ట్రైనింగ్‌ సెషన్‌ ప్రారంభమైంది. టీ20 ప్రపంచకప్‌లో అంచనాల మేరకు రాణించలేకపోతోన్న రోహిత్‌ కూడా తన బ్యాటింగ్‌ను మెరుగుపరచుకునేందుకు ప్రాక్టీస్‌ సెషన్‌కు వచ్చాడు. అక్కడ టీమిండియా త్రోడౌన్‌ ఎక్సపర్ట్‌ రఘుతో కలిసి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ మొదలెట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..