AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ఈ నెల 22న కోహ్లీకి పరీక్ష.. పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడా? టెన్షన్.. టెన్షన్..

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఈ నెల 22న ఫిట్‌నెస్ టెస్ట్ ఎదుర్కోనున్నాడు. ఐపీఎల్ గాయం తర్వాత అఫ్ఘానిస్థాన్ సిరీస్‌కు దూరమైన కోహ్లీ, ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ పరీక్షలో విజయం సాధించడం సులభమని అభిమానులు భావిస్తున్నా, 2027 వన్డే ప్రపంచ కప్‌లో చోటు కోసం ఇంగ్లాండ్ సిరీస్‌లో అతని ప్రదర్శన కీలకం.

Virat Kohli: ఈ నెల 22న కోహ్లీకి పరీక్ష.. పాస్ అవుతాడా? ఫెయిల్ అవుతాడా? టెన్షన్.. టెన్షన్..
Virat Kohli Fitness Test
SN Pasha
|

Updated on: Jun 20, 2026 | 12:55 PM

Share

టీమిండియా స్టార్ క్రికెటర్, అభిమానులతో పాటు క్రికెట్ లోకమంతా ముద్దుగా పిలుచుకునే కింగ్ విరాట్ కోహ్లీ ఈ నెల 22న ఓ పరీక్షకు హాజరుకానున్నాడు. మరి ఆ పరీక్షలో పాస్ అవుతాడా? లేక ఫెయిల్ అవుతాడా? ఇప్పుడు ఇదే అతని అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్‌గా ఉంది. ఇంతకీ ఏం పరీక్ష అని అనుకుంటున్నారా? ఏం లేదండీ.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కి ముందు విరాట్ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేయాల్సి ఉంది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌ ఆడుతూ తొడకండరాలు పట్టేయడంతో కోహ్లీ ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు వన్డేల సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

ఇప్పుడు తిరిగి ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు రెడీ అవుతున్నాడు. దాని కంటే ముందు తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు ఈ నెల 22న బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో బీసీసీఐ పెట్టే ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొంటాడు. ఇంత వయసు వచ్చినా.. ఫిట్‌నెస్ విషయంలో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్న కోహ్లీ ఈ టెస్ట్‌ను ఈజీగా పాస్ అవుతాడంటూ కొంతమంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద మహా సముద్రాలను దాటిన హనుమంతుడికి పిల్ల కాలువలు చూపించి, దీన్ని దూకుతావా? అని అడిగినట్లు, విరాట్ లాంటి ఫిట్‌నెస్ ఫ్రీక్‌కు ఇలాంటి చిన్న చిన్న టెస్టులు కూడా పెద్ద విషయం కాదని అతని అభిమానులు అంటున్నారు.

విరాట్ ఈ టెస్ట్ క్లియర్ చేయడం పెద్ద విషయం కాదనుకోండి. అయితే ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఎలా రాణిస్తాడనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎందుకంటే.. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలని కోరుకుంటున్న కోహ్లీ.. ఆ టోర్నీ ప్రారంభం అయ్యేనాటికి జరిగే ఈ సిరీస్‌ల్లో రాణిస్తే.. అతనికి జట్టులో చోటుకు ఢోకా ఉండదు. ఐపీఎల్ 2026‌లో అద్భుత ఫామ్ కనబర్చిన కింగ్.. వన్డేల్లోనూ అదే దూకుడును చూపిస్తాడని అంతా భావిస్తున్నారు. పైగా వన్డేలంటే విరాట్ కోహ్లీకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. ప్రపంచపు నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడో లిఖించబడింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us